వరుణ్ తేజ్ కొత్త సినిమా మరోసారి వార్తల్లోకొచ్చింది. వరుసగా ప్రయోగాలు చేస్తున్న ఈ హీరో, తాజాగా హారర్-కామెడీ సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా ప్రకటన కూడా అధికారికంగా వచ్చేసింది.
ఇది రెగ్యులర్ హారర్-కామెడీ కాదు. ఇండో-కొరియన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న సినిమా. అందుకే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం వియత్నాం వెళ్లింది యూనిట్. అక్కడున్న ఫేమస్ గోల్డెన్ బ్రిడ్జ్ ఫొటోల్ని యూనిట్ షేర్ చేసింది.
ఫొటోల్లో వరుణ్ తేజ్ తన మేకోవర్ ను దాచిపెట్టినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా కోసం అతడు కొత్త గెటప్ ప్రయత్నిస్తున్నట్టున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోల్లో నిర్మాతలు, దర్శకుడు కూడా ఉన్నారు.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈ సినిమా రాబోతోంది. మార్చి మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కొరియన్ కనకరాజు అనే టైటిల్ అనుకుంటున్నారు.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ