కుంభమేళా.. చెత్త డబ్బాలే ప్రాణాలు తీశాయి

తలపై లగేజీతో, కింద ఏముందో చూసుకోకుండా, తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో, ఇనుప చెత్త బుట్టలు తగిలి చాలామంది కింద పడ్డారు. అలా తొక్కిసలాట జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

ఘోరం జరిగిపోయింది. పవిత్ర కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా ఎంతమంది మృతిచెందారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. మరోవైపు దుర్ఘటనకు దారితీసిన కారణాలపై పలు వాదనలు వినిపిస్తున్నాయి.

తొక్కిసలాటకు ప్రధానంగా అందరూ చెబుతున్న కారణం చెత్త డబ్బాలు. భక్తుల సౌకర్యార్థం బారికేడ్లకు సమీపంలో చాలా చోట్ల ఇనుప చెత్త డబ్బాలు ఉంచారు. రాత్రి 2 గంటల సమయంలో పవిత్ర స్నానానికి వచ్చిన భక్తులు కొంతమందికి ఆ చీకట్లో అవి కనిపించలేదు. అలా భక్తులు కింద పడ్డంతో తొక్కిసలాట జరిగినట్టు ఎక్కువమంది ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

త్రివేణి సంగమంలోని ప్రధాన ఘాట్ కు కిలోమీటర్ దూరంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. దాదాపు 2 కిలోమీటర్ల దూరం నుంచే భారీ చెత్త డబ్బాలు భక్తులకు ఇబ్బందికరంగా మారాయని, ఘాట్ కు సమీపిస్తున్న కొద్దీ జనసమూహం, తోపులాట పెరిగిందని, ఫలితంగా కింద ఉన్న చెత్త డబ్బాలు తగిలి కొంతమంది భక్తులు కింద పడ్డంతో తొక్కిసలాట జరిగినట్టు చెబుతున్నారు.

ఇది ప్రధాన కారణం కాగా.. ఇతర కారణాల విషయానికొస్తే.. ప్రధాన స్నానవాటికకు ఎక్కువ మంది భక్తులు వస్తారని తెలిసి కూడా, అన్ని స్నాన ఘట్టాల తరహాలోనే ప్రధానమైన సెక్టార్-2 వద్ద కూడా సాధారణ ఏర్పాట్లు చేయడం తొక్కిసలాటకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘాట్ కు ఎక్కువమంది భక్తులు వస్తారని తెలిసి కూడా అదనపు సిబ్బంది, అదనపు ఏర్పాట్లు చేయకపోవడం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తొక్కిసలాట దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ కేవలం 12- 15 మంది పోలీసులు మాత్రమే ఉన్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ వద్ద 12 కోట్ల మంది భక్తులున్నారు. ఉదయం 8 గంటల సమయానికి 2 కోట్ల 78 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పరమ పవిత్ర కుంభమేళాలో ఇప్పటివరకు 20 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

కుంభమేళాలో ఈరోజు వచ్చిన అమావాస్య ఎంతో ప్రత్యేకమైనది. దీన్ని మౌని అమావాస్య అంటారు. మహాశివరాత్రి ముందు వచ్చే ఈ అమావాస్యను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే సకల పాపాలు తొలిగిపోతాయని హైందవుల నమ్మకం. అందుకే కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ కు చేరుకున్నారు. వీళ్లలో ఎక్కువమంది ప్రధాన ఘాట్ వద్ద స్నానం చేయడానికి ఎగబడ్డారు. తలపై లగేజీతో, కింద ఏముందో చూసుకోకుండా, తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో, ఇనుప చెత్త బుట్టలు తగిలి చాలామంది కింద పడ్డారు. అలా తొక్కిసలాట జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

14 Replies to “కుంభమేళా.. చెత్త డబ్బాలే ప్రాణాలు తీశాయి”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. మావోడే సీఎం అయ్యుంటే అసలు హిందువుల మీదకక్షతో కుంభమేళానే BAN చేసేవాడు, ఇక తొక్కకిసలాట స్కోప్ ఉండేదే కాదు తెలుసా??

  3. మావోడు సీఎం అయ్యుంటే ఊరికో

    “త్రివేణి సంఘమం సెట్టింగ్” వేసి, ఇంటింటికీ వాలంటీర్స్ తో కుంభమేళా నీళ్లు అందించేవాడు తెలుసా??

    ఈ జనాలు ఉన్నారే.. 11 ఇంచులు దింపి లండన్ కి పారిపోయేట్టు చేశారు.. కోపంగా ఉంది.

  4. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  5. డబ్బాల బుక్స్ , ఐరన్ లెగ్ అడుగు పెట్టింది అంతే సర్వ నాశనం, ఐరన్ లెగ్ ని ఇటలీ పంపించాలి , 11 రెడ్డి కి అన్ని కలసి వస్తాయి.

  6. Ante muhurtam time ki manshulani tokkesi champesi maree snanam chesesina punyam vachesthada? seriously? public intha kodi brain tho batikestunnara.

Comments are closed.