మరో చప్పటి వేసవి రాబోతోందా?

విశ్వంభర కూడా స్కిప్ కొట్టిందంటే, ఒక్క పెద్ద సినిమా కూడా లేకుండా ఈ వేసవి ముగిసేలా ఉంది. హిట్-3, కన్నప్ప, జాక్, రాబిన్ హుడ్ లాంటి సినిమాలతో సర్దుకుపోవాల్సిందే.

టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ అంటే ఎలా ఉండాలి? బాక్సాఫీస్ భగభగలాడాలి. రికార్డులు సలసలా కాగాలి. థియేటర్లు కిటకిటలాడాలి. కానీ, ఈ వేసవికి ఇలాంటి ఎక్సయిట్ మెంట్ ఆశించడం భ్రమే అవుతుంది. వస్తాయనుకున్న పెద్ద సినిమాలు వాయిదా పడుతున్నాయి.

రాజాసాబ్ సినిమాతో ఈ వేసవి బాక్సాఫీస్ వేడెక్కుతుందని అనుకున్నారంతా. కానీ ఏప్రిల్ 10న రావాల్సిన ఆ సినిమా నిరవధికంగా వాయిదాపడింది. సమ్మర్ లో సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ ను చూసే అవకాశం లేనట్టే.

అటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. వేసవి శెలవులు హరిహర వీరమల్లు సినిమాతో గ్రాండ్ గా మొదలవుతాయని పవన్ ఫ్యాన్స్ భావించారు. కట్ చేస్తే, మార్చి 28కి ఈ సినిమా వచ్చేది అనుమానమే. ఓవైపు మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు కానీ పరిస్థితి చూస్తుంటే ఏమంత ఆశాజనకంగా లేదు.

ఇక మూడో పెద్ద సినిమా విశ్వంభర. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా సమ్మర్ లో సందడి చేస్తుందని అంతా వెయిటింగ్. ప్రస్తుతానికైతే మే 9కి సినిమా వచ్చే ఛాన్స్ ఉందంటూ ఫీలర్లు వస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

విశ్వంభర కూడా స్కిప్ కొట్టిందంటే, ఒక్క పెద్ద సినిమా కూడా లేకుండా ఈ వేసవి ముగిసేలా ఉంది. హిట్-3, కన్నప్ప, జాక్, రాబిన్ హుడ్ లాంటి సినిమాలతో సర్దుకుపోవాల్సిందే.

అన్నట్టు గతేడాది కూడా టాలీవుడ్ లో ఇదే పరిస్థితి. వస్తాయనుకున్న పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ ఏడాది కూడా అదే వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఏంటో, టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ మరీ లాటరీ టికెట్స్ లా మారాయి.

4 Replies to “మరో చప్పటి వేసవి రాబోతోందా?”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.