ఆమధ్య జైలర్-2 ప్రకటించారు. ఎనౌన్స్ మెంట్ వీడియోనే ఓ రేంజ్ లో ఉంది. స్వయంగా రజనీకాంత్ ఆ వీడియోలో నటించారు. ఓ టీజర్ కు ఏమాత్రం తీసిపోని ఆ వీడియోతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఇప్పుడలాంటిదే మరో వీడియో వచ్చింది. ఇది కూడా కోలీవుడ్ నుంచే.
శివ కార్తికేయన్ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. సుధా కొంగర దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు పరాశక్తి అనే పేరుపెట్టారు. ఈరోజు టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు.
టైటిల్ టీజర్ ఎలా ఉందంటే.. నేరుగా ఈ వీడియోను థియేట్రికల్ ట్రయిలర్ కింద రిలీజ్ చేయొచ్చు. అంత పక్కాగా ఉంది ఈ టైటిల్ టీజర్. హీరో శివ కార్తికేయన్, కీలక పాత్రధారి రవి మోహన్ (జయం రవి), హీరోయిన్ శ్రీలీల, మరో ఇంపార్టెంట్ రోల్ పోషించిన అధర్వ.. ఇలా పాత్రలన్నింటినీ టైటిల్ టీజర్ లోనే పరిచయం చేశారు.
రవి కె చంద్రన్ విజువల్స్ పిచ్చెక్కించగా.. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అదిరింది. టీజర్ చూస్తుంటే, సుధ కొంగర ఈసారి మరో మంచి సబ్జెక్ట్ ఎత్తుకున్నట్టు అనిపిస్తోంది.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
Chattaga undi..
Idedo arava melam la undi. Madhyalo maa sreeleela naligipoddi