“ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే అన్నీ మాట్లాడుకుందాం.” మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి పృధ్వీరాజ్ సుకుమారన్ స్టేట్ మెంట్ ఇది.
ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం పృధ్వీరాజ్ ను తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై పృధ్వీరాజ్ పైవిధంగా స్పందించాడు. అతడు అలా అన్నాడంటే సినిమాలో ఉన్నట్టేనని అంతా ఫిక్స్ అయిపోయారు. దీనికి ఓ రీజన్ ఉంది.
సలార్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ ప్రాజెక్టులో ఉన్నారా లేదా అనే ప్రశ్నకు సరిగ్గా ఇలానే స్పందించాడు పృధ్వీరాజ్. అప్పుడు పృధ్వీరాజ్ చెప్పిన మాటల్ని ఇప్పుడు మరోసారి వైరల్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.
అప్పుడు ఇలానే స్పందించాడని కట్ చేస్తే, సలార్ లో ప్రత్యక్షమయ్యాడని.. ఇప్పుడు కూడా సేమ్ స్టేట్ మెంట్ ఇచ్చాడంటే మహేష్-రాజమౌళి సినిమాలో ఉన్నట్టేనని ఫిక్స్ అయిపోయారు.
నిజానికి ఈ ప్రాజెక్ట్ లో పృధ్వీరాజ్ బదులు జాన్ అబ్రహాంను తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. కానీ తనతోనే చర్చలు జరుపుతున్నట్టు పృధ్వీరాజ్ పరోక్షంగా స్పష్టత ఇచ్చినట్టయింది.
మహేష్-రాజమౌళి సినిమా సీక్రెట్ గా ప్రారంభమైంది. హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను లాక్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. విలన్ ఎవరనేది మరికొన్ని రోజుల్లో లాక్ చేయబోతున్నారు. ఇలా చాలా జరుగుతున్నప్పటికీ అన్నీ సీక్రెట్ గా ఉంచుతున్నాడు రాజమౌళి.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
Hi