వాళ్లిద్ద‌రికీ మంత్రి ప‌ద‌వులు ఎలా?

ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కొలుసు పార్థ‌సార‌ధికి మంత్రి ప‌ద‌వులు ఎలా ఇచ్చార‌ని సీనియ‌ర్ నేత‌లు నిల‌దీస్తున్నారు.

మొద‌టి నుంచి పార్టీని న‌మ్ముకున్న వారికే ప‌ద‌వులు ద‌క్కేలా చూడాల‌ని ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. ఇది మంచి నిర్ణ‌య‌మే. ఎన్నిక‌ల‌కు ముందు, అలాగే ఈ మ‌ధ్య కాలంలో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నాయ‌కుల కంటే, టీడీపీనే న‌మ్ముకుని ప‌ని చేసిన నాయ‌కుల్ని ప్రోత్స‌హించాల‌ని బాబు స్ప‌ష్టం చేయ‌డం అభినంద‌నీయం. చంద్ర‌బాబు ఆదేశాలు ఇత‌ర పార్టీల‌కు కూడా ఆద‌ర్శ‌నీయం.

అయితే టీడీపీనే న‌మ్ముకుని, వైసీపీ పాల‌న‌లో అష్ట‌క‌ష్టాలు ప‌డిన త‌మను ఎందుకు ప్రోత్స‌హించ‌లేద‌ని కొంద‌రు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ‌కు నీతులు చెబుతున్న చంద్ర‌బాబు.. తాను మాత్రం ఎందుకు పాటించ‌లేద‌ని ఆఫ్ ది రికార్డు అంటూ నిల‌దీస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కొలుసు పార్థ‌సార‌ధికి మంత్రి ప‌ద‌వులు ఎలా ఇచ్చార‌ని సీనియ‌ర్ నేత‌లు నిల‌దీస్తున్నారు.

ముఖ్యంగా దూళిపాళ్ల న‌రేంద్ర‌, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, ప‌రిటాల సునీత‌, ప‌త్తిపాటి పుల్లారావు, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి కాల్వ శ్రీ‌నివాసులు త‌దిత‌రులు మంత్రి ప‌ద‌వుల్ని ఆశించారు. ఇలాంటి వాళ్లంతా మొద‌టి నుంచి టీడీపీనే న‌మ్ముకున్న నాయ‌కులు. కానీ మంత్రి ప‌ద‌వులు మాత్రం ద‌క్క‌లేదు.

నామినేటెడ్ పోస్టులు మాత్రం టీడీపీలో మొద‌టి నుంచి ఉన్న వాళ్ల‌కే ద‌క్కాల‌ని చంద్ర‌బాబు అన‌డాన్ని స్వాగ‌తిస్తూనే, అన్ని స్థాయిలోనూ అదే సూత్రం వ‌ర్తింప‌చేయాలి క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే మంత్రి ప‌ద‌వులు పూర్తిగా లోకేశ్ నిర్ణ‌య‌మ‌ని తెలిసే, సీనియ‌ర్లంతా గుర్రుగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

5 Replies to “వాళ్లిద్ద‌రికీ మంత్రి ప‌ద‌వులు ఎలా?”

  1. పుల్లలు.. ఏ పనీ పాట లేకుండా దేశాలు పట్టి తిరుగుతున్న

    “A1గాలోడి ‘గుద్దలో పెట్టు” అంతేకాని పని చేసే పార్టీ లో కాదు..

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.