తమ్ముళ్లకు ఇప్పట్లో నో గుడ్ న్యూస్!

ఎవరు కష్టపడ్డారో, ఎంత కష్టపడ్డారో ఎన్నికల తర్వాత ఏడునెలల వరకు కూడా గుర్తించలేని స్థితిలో ఉండడం వారి వైఫల్యమే కదా

ప్రతి సారీ ‘తాను మారిపోయిన చంద్రబాబును’ అని చెప్పుకోవడానికి తెలుగుదేశం అధినేత చాలా ఉత్సాహపడుతుంటారు గానీ.. ఆయనలో మార్పు రావడం చాలా చాలా కష్టం అనేది ఆ పార్టీ వారి అభిప్రాయంగా ఉంటోంది.

నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకోకపోవడం.. పార్టీకోసం పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టే విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ ఉండడం అనే కోణంలో ఆయనలో ఏ మార్పూ రాలేదని కార్యకర్తలు అంటున్నారు. రాష్ట్రంలో ఇంకా బోలెడన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉండగా.. చంద్రబాబునాయుడు.. జూన్ లోగా వాటిని భర్తీ చేస్తానంటూ సుదూరంగా గడువును నిర్దేశించడం అనేది.. కార్యకర్తలకు కడుపుమంట కలిగిస్తోంది.

చంద్రబాబునాయుడు సహజంగానే.. నామినేటెడ్ పదవులు పంచిపెట్టడంలో ఆలస్యం చేస్తుంటారు. కార్యకర్తల్లో ఎవరు ఎలా పనిచేస్తున్నారు.. పార్టీకోసం ఎవరెంత కష్టపడుతున్నారు.. లాంటి లెక్కలు తీయడంలో పార్టీ బోలెడంత టెక్నాలజీ వినియోగిస్తుంటుందని చంద్రబాబునాయుడు చెబుతూ ఉంటారుగానీ.. ఆ టెక్నాలజీ యొక్క ఫలితం మాత్రం మనకు కనిపించదు.

నిజంగానే పార్టీ నాయకుల పనితీరును బేరీజు వేసే టెక్నాలజీ పార్టీ వద్ద ఉంటే గనుక.. అధికారంలోకి వచ్చిన వారం నుంచి నెల రోజుల్లోగా.. రాష్ట్రంలో ఉండే సమస్త నామినేటెడ్ పోస్టుల నియామకం పూర్తయిపోవాలి. అధికారంలోకి రాక ముందునుంచీ.. గెలిస్తే అధికారుల్లో, పోలీసుల్లో ఎవరెవరిని ఏయే స్థానాల్లో నియమించుకోవాలో ముందుగానే కసరత్తు చేసిపెట్టుకుంటారు గానీ.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేసే విషయంలో మాత్రం.. మీనమేషాలు లెక్కిస్తుంటారనేది వారి ఆగ్రహంగా ఉంటోంది.

ఇప్పటిదాకా ఆయన కేవలం కొన్ని రకాల నామినేటెడ్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. వాటిలో టీటీడీ కూడా ఒకటి. అయితే ఇంకా అనేక ప్రధాన ఆలయాలకు సంబంధించిన ట్రస్టుబోర్డుల నియామకం పూర్తి కానేలేదు. చంద్రబాబు చెబుతున్న లెక్కల ప్రకారమే.. రాష్ట్రంలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్టు బోర్డులు ఉన్నాయి.

పార్టీ అధికారంలోకి వచ్చి ఏడునెలలు గడుస్తోంది. ఇన్నాళ్లుగా కార్యకర్తలు ఆ పదవులను అనుభవించే అవకాశాన్ని కోల్పోయినట్టే కదా అనేది వారి వాదన. ఇప్పుడైనా ఆశావహుల కోరిక వెంటనే తీరుతుందని గ్యారంటీ లేదు. జూన్ లోగా నియామకాలు పూర్తిచేస్తానని అంటున్నారంటే.. ఇంకా సాగదీస్తున్నారనేదే సంకేతంగా ఉంది.

పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు అంటూ చంద్రబాబుగానీ, లోకేష్ గానీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. మరి ఎవరు కష్టపడ్డారో, ఎంత కష్టపడ్డారో ఎన్నికల తర్వాత ఏడునెలల వరకు కూడా గుర్తించలేని స్థితిలో ఉండడం వారి వైఫల్యమే కదా.. అని అందరూ అనుకుంటున్నారు.

7 Replies to “తమ్ముళ్లకు ఇప్పట్లో నో గుడ్ న్యూస్!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. మా జనసేన దయతో గెలిచారు కాబట్టి 70% నామినేటెడ్ పదవులు మా పార్టీ వాళ్లకు ఇవ్వాలి

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.