ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియ తుదిఘట్టానికి చేరుకుంటున్నట్టుగా ఉంది. వందల సినిమాల వడపోత చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో హాలీవుడ్ సినిమా కాంక్లేవ్ ఎనిమిది విభాగాల్లో నామినేషన్లను పొందడం గమనార్హం. ఈ మధ్యకాలంలో ఇన్ని విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు పొందిన సినిమాలు అంతగా లేవు. ఇలాంటి నేపథ్యంలో కాంక్లేవ్ ఆసక్తిని రేపుతూ ఉంది.
బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగాలతో పాటు కాస్టూమ్స్, ఒరిజినల్ స్కోర్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఈ సినిమా అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యింది. మరి ఎన్ని సాధిస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం. చాలా అరుదుగా ఇన్ని విభాగాల్లో అవార్డులను పొందిన సినిమాలున్నాయి.
కథాంశం విషయానికి వస్తే పోప్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన కథాంశంతో వచ్చిన ఒక నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. యూఎస్, యూకేల్లో విడుదలై భారీ కలెక్షన్లను కూడా పొందింది ఈ సినిమా. ఈ సినిమా త్వరలోనే ఇండియాలో విడుదల కాబోతోంది. ఫిబ్రవరి ఏడో తేదీన ఈ సినిమా భారతదేశంలో విడుదల కానుంది.
కొత్త పోప్ ఎన్నిక ప్రక్రియలోని సభ్యులను కాంక్లేవ్ గా పరిగణిస్తారు.ఈ కథాంశం వింటే.. పోప్ జాన్ పాల్ 2 మరణం తర్వాత తదుపరి పోప్ ఎన్నిక పెద్ద తతంగంగా సాగిన వైనం గుర్తుకు వస్తుంది. కాంక్లేవ్ సభ్యులంతా చేరి, తలుపులు మూసి ఎన్నుకునే ప్రక్రియ గురించి బయటి ప్రపంచానికి సమాచారం ఇచ్చే వైనం కూడా చిత్రంగా ఉంటుంది. ఎన్నిక ప్రక్రియ పూర్తయితే ఒక రంగు పొగను, ఇంకా కుదరకపోతే మరో రకం పొగను వదిలి సమాచారం ఇస్తారు.
ప్రత్యేకించి 2005లో పోప్ జాన్ పాల్ మరణించిన తర్వాత తదుపరి పోప్ ఎన్నిక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశంగా నిలిచింది. దాంతో ఈ సినిమాకు సంబంధం ఉందో లేదో కానీ.. సినిమా అయితే థ్రిల్లర్ అని రివ్యూలు చెబుతున్నాయి.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Watched it already. I myself felt any religion has this good or bad heads as shown. Nothing special. Nomination due to afflictions to the dominated religion in Oscar’s.