అకిరాతో పంజా-2

కుదిరితే అకిరా నందన్ తో ఖుషి-2 తీస్తానని ఎస్ జే సూర్య ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు విష్ణు వర్థన్ వంతు.

మొన్న ఎస్ జే సూర్య… ఇప్పుడు విష్ణువర్థన్. కుదిరితే అకిరా నందన్ తో ఖుషి-2 తీస్తానని ఎస్ జే సూర్య ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు విష్ణు వర్థన్ వంతు. అన్నీ అనుకున్నట్టు సెట్టయితే, అకిరాతో పంజా-2 తీస్తానంటున్నాడు ఈ దర్శకుడు.

“అకిరా నందన్ చాలా ఛార్మింగ్. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. చాలా బాగుంటాడు. అతడితో పంజా-2 చేస్తే బాగుంటుంది. అయితే నేను ప్లాన్ చేసేకంటే, సరైన టైమ్ లో అది అలా జరగాలని కోరుకుంటాను. పంజా కూడా పవన్ కల్యాణ్ తో నేను ప్లాన్ చేయలేదు. అది అలా జరిగింది. పంజా-2 కూడా అలా జరగాలని కోరుకుంటున్నాను. ఆ ఛాన్స్ వస్తే అకిరాతో కచ్చితంగా చేస్తాను.”

పంజా చేసిన రోజుల్లో పవన్ కల్యాణ్ ను దగ్గరుండి గమనించే అవకాశం తనకు దక్కిందని తెలిపిన విష్ణువర్థన్.. పవన్ లో తనకు నచ్చిన క్వాలిటీ ఏంటో చెప్పుకొచ్చాడు.

“సూటిగా మాట్లాడేవాళ్లంటే పవన్ కు ఇష్టం. ఉన్నదున్నట్టు మాట్లాడాలి. ఆయన అలానే ఉంటారు. ఆయన చుట్టూ ఎప్పుడూ ఏదో పవర్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అయితే ఆయనది మాత్రం చిన్న పిల్లాడి మనస్తత్వం. ఒక ఎక్సయిట్ మెంట్ అయినా, ఏదైనా విషయంపై స్పందించాలన్నా, దేన్నయినా నమ్మాల్సి వచ్చినా ఆయన చాలా జెన్యూన్ గా, స్ట్రాంగ్ గా ఉంటారు. పవన్ లో నాకు నచ్చిన క్వాలిటీ అదే.”

పంజా తర్వాత తెలుగు నుంచి ఈ దర్శకుడికి చాలా ఆఫర్లు వచ్చాయంట. అయితే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల తెలుగులో చేయలేకపోయాడంట. ఈసారి తప్పకుండా తెలుగులో సినిమా చేస్తానని చెబుతున్నాడు.

5 Replies to “అకిరాతో పంజా-2”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.