నాగచైతన్య చెన్నైలో పుట్టాడు. హైదరాబాద్ లో పెరిగాడు. హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యాడు. మరి అతడికి వైజాగ్ తో కనెక్షన్ ఏంటి? వైజాగ్ తో తాజాగా బలమైన కనెక్షన్ ఏర్పడింది నాగచైతన్యకి. అతడి భార్య శోభిత ధూలిపాళది విశాఖపట్నమే.
ఇదే విషయాన్ని తండేల్ ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ లో ప్రస్తావించాడు నాగచైతన్య. ప్రస్తుతం తన ఇంట్లో వైజాగ్ అమ్మాయిదే డామినేషన్ అని… తండేల్ ను వైజాగ్ లో సక్సెస్ చేసి తన పరువు కాపాడాలని కోరాడు చైతూ.
“వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే.. నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే. సో.. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, తండేల్ సినిమాకు వైజాగ్ లో కలెక్షన్లు షేక్ అయిపోవాలి. లేదంటే ఇంట్లో నా పరువు పోతుంది.”
వైజాగ్ తో తనకున్న మరో సెంటిమెంట్ ను కూడా బయటపెట్టాడు నాగచైతన్య. తన సినిమా ఏది రిలీజైనా ముందుగా వైజాగ్ టాక్ కనుక్కుంటాడట. ఎందుకంటే, వైజాగ్ లో సినిమా ఆడిందంటే, ప్రపంచంలో ఎక్కడైనా ఆ సినిమా ఆడుతుందనేది నాగచైతన్య లాజిక్.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
అన్నయ్య అభిమానులు సహకరించాలి వైజాగ్ కోసమైనా