సంక్రాంతి పోయింది.. ఇప్పుడు శివరాత్రి

సంక్రాంతికి విశ్వంభర నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు శివరాత్రి అనే టాక్ వినిపిస్తోంది.

తనయుడు చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ కోసం తండ్రి చిరంజీవి, తను చేస్తున్న విశ్వంభరను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అలా వాయిదా పడిన విశ్వంభర సినిమాకు కొత్త విడుదల తేదీని సంక్రాంతికి ప్రకటిస్తారని అంతా ఎదురుచూశారు.

కానీ సంక్రాంతికి విశ్వంభర నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు శివరాత్రి అనే టాక్ వినిపిస్తోంది. ఈ శివరాత్రికి విశ్వంభర నుంచి రిలీజ్ అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం, విశ్వంభర సినిమాను మే9న విడుదల చేయాలనుకుంటున్నారట. గతంలో అదే తేదీకి చిరంజీవి నటించిన కల్ట్ మూవీ ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ వచ్చిన సంగతి తెలిసిందే. యాదృచ్ఛికం ఏంటంటే, అప్పుడొచ్చిన ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’, ఇప్పుడు విడుదలకు సిద్ధమైన విశ్వంభర రెండూ సోషియో ఫాంటసీ సినిమాలే.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. చిరంజీవితో పాటు.. దర్శకుడు వశిష్ఠ, సంగీత దర్శకుడు కీరవాణి, కొంతమంది సింగర్స్ ఇందులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని కూడా కీరవాణి షేర్ చేశారు.

3 Replies to “సంక్రాంతి పోయింది.. ఇప్పుడు శివరాత్రి”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.