మార్కో హీరోయిన్ కు మళ్లీ చాన్స్

మార్కో హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి పడింది. అందుకే కిరణ్ అబ్బవరంతో నిర్మాత రాజేష్ దండా నిర్మించే కే ర్యాంప్ అనే సినిమాకు హీరోయిన్ గా తీసుకున్నారు.

ఇటీవల వచ్చిన మలయాళ సినిమా మార్కో. అది అతి పెద్ద హిట్. ఈ సినిమాలో హీరోయిన్ యుక్తి తరేజా. ఈ అమ్మాయికి ఇప్పుడు తెలుగులో మంచి చాన్స్ వచ్చింది. నిజానికి తెలుగులో ఈ అమ్మాయి గతంలో చేసింది. కానీ సినిమా హిట్ కాక ఎవరికీ తెలియకుండా అయిపోయింది.

మార్కో హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి పడింది. అందుకే కిరణ్ అబ్బవరంతో నిర్మాత రాజేష్ దండా నిర్మించే కే ర్యాంప్ అనే సినిమాకు హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈ అమ్మాయి ఇప్పటికే తెలుగులో ఒకసారి నటించింది. రంగబలి సినిమాలో నాగశౌర్య సరసన. కానీ సినిమా పెద్దగా ఆడకపోవడంతో టాలీవుడ్ దృష్టిని అంతగా ఆకర్షించలేదు. ఇప్పుడు పాన్ ఇండియా హిట్ సినిమా పడడంతో మళ్లీ చాన్స్ వచ్చింది. ఈసారి కిరణ్ అబ్బవరం సరసన. సినిమాకు మంచి కథ సెట్ అయిందని టాక్. అందువల్ల ఇకపై తెలుగులో చకచకా అవకాశాలు అందుతాయేమో?

ఈ అమ్మాయి ఇన్ స్టా లో చాలా యాక్టివ్. రీల్స్, పోస్ట్ లు ఒకటేమిటి..అందువల్ల అందరికీ పరిచయమే. కానీ చాన్స్ నే లేట్ అయింది. ఈ సినిమా ఏమాత్రం బాగున్నా తెలుగులో సెట్ అవుతుంది. మిడ్ రేంజ్ హీరోలకు హీరోయిన్ల కొరత వుండనే వుంది.

2 Replies to “మార్కో హీరోయిన్ కు మళ్లీ చాన్స్”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.