నేను కూడా హీరోను అవుతా: రాజమౌళి

త్వరలోనే హీరో అవుతానంటున్నాడు రాజమౌళి. ఇదేదో అందరూ అనుకునే వెండితెర హీరో అవతారం మాత్రం కాదు. ప్లాస్మా దానం చేసి మానవత్వం ఉన్న హీరోగా నిలుస్తానంటున్నాడు ఈ దర్శకధీరుడు. Advertisement “ప్లాస్మా డోనర్స్ ను…

త్వరలోనే హీరో అవుతానంటున్నాడు రాజమౌళి. ఇదేదో అందరూ అనుకునే వెండితెర హీరో అవతారం మాత్రం కాదు. ప్లాస్మా దానం చేసి మానవత్వం ఉన్న హీరోగా నిలుస్తానంటున్నాడు ఈ దర్శకధీరుడు.

“ప్లాస్మా డోనర్స్ ను చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. ఎవరైతే ప్లాస్మా దానం చేస్తున్నారో వాళ్లు అసలైన హీరోలు. వాళ్లే యోధులు. రోజూ నేను చాలామంది హీరోల్ని హీరోల్ని చూస్తుంటాను. కానీ ప్రజల మధ్య నుంచి వచ్చిన ఈ హీరోల్ని (ప్లాస్మా దాతలు) చూస్తుంటే గర్వంగా అనిపించింది. నా బాడీలో కూడా రోగనిరోధక శక్తి పెరిగితే నేను కూడా ప్లాస్మా డొనేట్ చేస్తాను. హీరోను అవుతాను.”

కరోనా నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి బయటకొచ్చాడు రాజమౌళి. హైదరాబాద్ పోలీస్ తో కలిసి “డొనేట్ ప్లాస్మా” క్యాంపెయిన్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి, కరోనాపై ఎలాంటి అపోహలు వద్దంటున్నాడు.

“కరోనాపై ఎలాంటి అపోహలు వద్దు. ఇప్పుడు రకరకాల మందులొచ్చాయి. దాదాపు 20 రకాల మందులొచ్చాయి. అన్ని దశల్లో కరోనాను తగ్గించగలిగే ట్రీట్ మెంట్స్ వచ్చేశాయి. వైద్యుల దగ్గర ప్లాస్మా ఉంటే బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది.”

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులంతా ప్లాస్మా దానం చేయాలని పిలుపునిస్తున్నాడు రాజమౌళి. భార్య రమాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

అత్తగా నీకు నా ఛాలెంజ్

ఎన్నో ఏడ్చిన రాత్రులు ఉన్నాయి