యాంగ్రీ మేన్ కాదు.. ‘ఎక్స్ ట్రా ఫన్’ మేన్

యాంగ్రీ మేన్.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా రాజశేఖర్ గుర్తొస్తారు. ఇలాంటి నటుడు ఎక్స్ ట్రా – ఆర్డినరీ మేన్‌ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలియగానే చాలామంది చాలా ఊహించుకున్నారు. అతడు సినిమాలో…

యాంగ్రీ మేన్.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా రాజశేఖర్ గుర్తొస్తారు. ఇలాంటి నటుడు ఎక్స్ ట్రా – ఆర్డినరీ మేన్‌ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలియగానే చాలామంది చాలా ఊహించుకున్నారు. అతడు సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపిస్తాడని, యాక్షన్ సన్నివేశాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయంటూ స్టోరీలు కూడా వచ్చేశాయి.

కట్ చేస్తే, దీనికి పూర్తి రివర్స్ లో స్పందించారు ఎక్స్ ట్రా – ఆర్డినరీ మేన్‌ మేకర్స్. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందట. ఈ క్యారెక్టర్ రాజశేఖర్ కు చాలా బాగా నచ్చిందట. అందుకే వెంటనే నటించడానికి ఒప్పుకున్నాడట.

రాజశేఖర్ స్మైల్ చాలా బాగుంటుందని, తమ సినిమాలో ఆ నవ్వు కనిపించాలని దర్శకుడు ముందే కండిషన్ పెట్టాడట. ప్రేక్షకులు ఊహించనంతగా రాజశేఖర్ ఈ సినిమాలో ఎంటర్ టైన్ చేస్తాడట. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎక్స్ ట్రా – ఆర్డినరీ మేన్‌  సినిమాలో రాజశేఖర్ నుంచి పుల్ లెంగ్త్ ఫన్ చూస్తారట ఆడియన్స్.

ఇలా రాజశేఖర్ పాత్రపై ఇన్నాళ్లూ ప్రేక్షకులు ఊహించుకున్నదానికి పూర్తి రివర్స్ లో స్పందించారు మేకర్స్. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే సినిమాలో ఫన్ ఎక్కువగా ఉంటుందనే విషయం ప్రేక్షకులకు అర్థమైంది. అయితే రాజశేఖర్ పాత్ర కూడా కామెడీగానే ఉంటుందనే విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.