తన సినిమా వాయిదా పడిందన్న కోపంలో విశ్వక్ సేన్ గతంలో నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. 'తగ్గేకొద్దీ మింగుతారు' అంటూ వల్గర్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. “బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు..” అంటూ ఇంకో స్టేట్ మెంట్ కూడా పడేశాడు.
ఇదంతా ఓకే కానీ, అదే పోస్టులో నిర్మాత నాగవంశీకి ఓ వార్నింగ్ ఇచ్చాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ లో రాకపోతే, ఆ సినిమా ప్రచారంలో తనను చూడరంటూ భారీ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వచ్చేలా లేదు. డిసెంబర్ లో ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు. మరి ఇప్పుడు విశ్వక్ సేన్ ఏం చేయబోతున్నాడు? తను వార్నింగ్ ఇచ్చినట్టు నిజంగానే ప్రచారానికి దూరంగా ఉంటాడా? అలా చేస్తే ఎవరికి నష్టం?
సినిమా అందరిదీ. అంతా కలిసి తలో చేయి వేస్తేనే ప్రాజెక్టు సాఫీగా థియేటర్లలో ల్యాండ్ అవుతుంది. విశ్వక్ సేన్ ప్రచారానికి రానంత మాత్రాన సినిమా రిలీజ్ ఆగదు. అయితే నిజంగా అలా జరిగితే భవిష్యత్తులో విశ్వక్ సేన్ కే అది నష్టం తెచ్చిపెడుతుంది. విశ్వక్ ప్రచారం చేయకపోతే, నిర్మాతకు నష్టం రావొచ్చు. కానీ అది ఆ సినిమా వరకే. విశ్వక్ కు మాత్రం అది కెరీర్ పై ప్రభావం చూపిస్తుంది.
గతంలో తను పెట్టిన పోస్టును విశ్వక్ సేన్ డిలీట్ చేశాడు. అయితే చాలామంది జనాలు ఆ మేటర్ ను మరిచిపోలేదు. సినిమా వాయిదా పడిందనే కథనాలపై విశ్వక్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి! పైగా ఈ సినిమాపై ఈ హీరో చాలా హోప్స్ పెట్టుకున్నాడు.