సూపర్ స్టార్ 170వ సినిమా విశేషాలు..!

కెరీర్ లో 170వ సినిమా మైలురాయికి చేరువయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈరోజు ఈ సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రజనీకాంత్ 170వ సినిమా రాబోతోంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్.…

కెరీర్ లో 170వ సినిమా మైలురాయికి చేరువయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈరోజు ఈ సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రజనీకాంత్ 170వ సినిమా రాబోతోంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్.

సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు టీజే జ్ఞానవేల్. ఆ సినిమాతో ఏకంగా రజనీకాంత్ ను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. ఆల్రడీ హీరో-దర్శకుడి మధ్య కథాచర్చలు పూర్తయ్యాయి. దీంతో ఈరోజు సినిమాను అధికారికంగా ప్రకటించారు.

రజనీకాంత్ స్టయిల్ లో ఉంటూనే, జై భీమ్ తరహాలో బలమైన సందేశంతో ఈ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్టుకు అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఇంతకుముందు రజనీకాంత్ నటించిన దర్బార్, పేట సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించాడు.

ఈ ఏడాదిలోనే రజనీకాంత్ 170వ సినిమా సెట్స్ పైకి వస్తుందని, వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేస్తామని లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు రజనీకాంత్.