రజనీకాంత్ డిశ్చార్జ్.. వారం రోజులు విశ్రాంతి

షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి, అస్వస్థతకు గురై అపోలో హాస్పిటల్ లో చేరిన రజనీకాంత్.. 48 గంటలకు పైగా వైద్యుల పర్యవేక్షణలో ఉండి, కొద్దిసేపటి కిందట డిశ్చార్జ్ అయ్యారు.  Advertisement హై-బీపీతో ఆస్పత్రిలో చేరిన…

షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి, అస్వస్థతకు గురై అపోలో హాస్పిటల్ లో చేరిన రజనీకాంత్.. 48 గంటలకు పైగా వైద్యుల పర్యవేక్షణలో ఉండి, కొద్దిసేపటి కిందట డిశ్చార్జ్ అయ్యారు. 

హై-బీపీతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ కు వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేశారు. నిన్నటికే కొన్ని రిపోర్టులు రాగా అవన్నీ నార్మల్ అని తేలింది. ఈరోజు ఉదయం వచ్చిన మిగతా రిపోర్టుల్లో కూడా అంతా సాధారణంగానే ఉన్నట్టు తేలడంతో.. వైద్యులు రజనీకాంత్ ను డిశ్చార్జ్ చేశారు.

అయితే రజనీకాంత్ ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆయనకు వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. హై-బీపీ తగ్గడానికి కొన్ని వ్యాయామాలు సూచించారు. 

ఇక కరోనా కారణంగా ఎలాంటి కార్యక్రమాల్లో రజనీకాంత్ పాల్గొనకూడదని కూడా హెచ్చరించారు. ఎందుకంటే గతంలో రజనీకాంత్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. కాబట్టి హై-రిస్క్ వ్యక్తుల కేటగిరీలో రజనీకాంత్ కూడా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

అపోలో హాస్పిటల్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా చెన్నైలోని తన నివాసానికి చేరుకుంటారు రజనీకాంత్. తన తండ్రి వారం రోజుల పాటు అన్ని రకాల కార్యక్రమాలకు దూరంగా ఉంటారని రజనీకాంత్ కుమార్తె వెల్లడించారు.

అన్నాత్తై సినిమా షూటింగ్ కోసం 13న హైదరాబాద్ వచ్చారు రజనీకాంత్. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత యూనిట్ లో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో షూటింగ్ ను అర్థాంతరంగా ఆపేసి, ముందుజాగ్రత్తగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు రజనీకాంత్. 

టెస్టుల్లో కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ, హై-బీపీతో బాధపడ్డారు. అలా 2 రోజులు హాస్పిటల్ కే పరిమితమైన సూపర్ స్టార్, కొద్దిసేపటి  కిందట డిశ్చార్జ్ అయ్యారు.

సోహైల్ సినిమాలో అరియానా హిరోయినా ?