సవాల్ చేసి ప్రమాణానికి రాని వెలగపూడి

టీడీపీ అధినేత చంద్రబాబుకు వీర విధేయుడు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు సవాల్ చేసి జవాబు ఇవ్వకుండా  తప్పించుకున్నారు. ప్రమాణం చేస్తానంటూ డేట్ టైం చెప్పి కూడా ఇంట్లోనే ఉండిపోయారు. Advertisement…

టీడీపీ అధినేత చంద్రబాబుకు వీర విధేయుడు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు సవాల్ చేసి జవాబు ఇవ్వకుండా  తప్పించుకున్నారు. ప్రమాణం చేస్తానంటూ డేట్ టైం చెప్పి కూడా ఇంట్లోనే ఉండిపోయారు.

దీంతో వైసీపీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో వెలగపూడి రాలేదంటే ఆయన తనకు తానుగా విశాఖలో  భూ ఆక్రమణలను ఒప్పుకున్నట్లేనని తేల్చేశారు. వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అయితే వెలగపూడి విశాఖ సాయిబాబా మీద ప్రమాణం చేస్తానని చెప్పి తోక ముడిచారని అన్నారు. అంటే ఆయన‌ తాను భూ ఆక్రమణలకు పాల్పడ్డానని చెప్పకనే చెప్పేశారని కూడా ఎటాక్ చేశారు.

ఇదిలా ఉంటే విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మధ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. 

తాను ఒక్క గజం స్థలం ఆక్ర‌మించినట్లు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెలగపూడి భారీ రియాక్షన్ ఇచ్చారు. ఇక తనపైన విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు నిజమని  దేవుని ఎదుట ప్రమాణం చేయగలరా అంటూ గట్టిగానే సవాల్ చేశారు.

దానికి గుడివాడ రియాక్ట్ అయి ఆయన చెప్పిన సాయి బాబా ఆలయానికి వచ్చినా వెలగపూడి రాకపోవడం విశేషం. మొత్తం ఎపిసోడ్ విషయంలో వెలగపూడి వెనకడుగు వేశారని మాత్రం అర్ధమవుతోంది. 

ఇక గుడివాడ అయితే ఒక్క గజం నిరూపించమన్న వెలగపూడి రుషికొండ దగ్గర 225 గజాల స్థలం ఆక్రమించారు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా కూడా ఉంది. మరి ఇపుడు వెలగపూడి రాజీనామా చేస్తారా అంటూ నిలదీశారు. 

వెలగపూడి మీద క్రిమినల్ చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. మొత్తానికి వెలగపూడి టార్గెట్ గా వైసీపీ లేపిన సవాళ్ళ ఎపిసోడ్ లో బాబు భక్తుడు మాత్రం ఎందుకో సైలెంట్ అయ్యారనే అంటున్నారు.

సోహైల్ సినిమాలో అరియానా హిరోయినా ?