కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. దివంగత సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన సంతాప సభకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు మంత్రి రాజ్ నాథ్ సింగ్. కృష్ణం రాజు నాకు అత్మీయ మిత్రుడంటూ, ఎప్పుడు కలిసిన ఆప్యాయంగా మాట్లాడేవారన్నారు. కొన్ని నెలల క్రితం ఢిల్లీలో కృష్ణంరాజును కలిసినప్పుడు ఆనారోగ్యంతో ఉన్నట్లు అనిపించలేదన్నారు.
కృష్ణంరాజు పెద్ద స్టార్ అయినా.. నన్ను అన్నగారు అని పిలిచేవారని, ఆకస్మిక వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యనన్నారు. కృష్ణంరాజు మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని, 55 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారనన్నారు.
1998లో కృష్ణంరాజును తొలిసారిగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ఢిల్లీకి వచ్చినప్పడు కలిశానని, వాజ్ పేయి మంత్రి వర్గంలో ఉన్నప్పుడు కృష్ణంరాజుకు బాగా దగ్గరయ్యనంటూ గుర్తు చేసుకున్నారు.