రూ.50 లక్షలకు రాఖీ సావంత్ న్యూడ్ వీడియోలు

రాఖీ సావంత్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది ఈమె. ఎప్పట్లానే ఈసారి కూడా వివాదానికి తన భర్త ఆదిల్ ఖాన్ దురానీనే కారణం అని ఆరోపిస్తోంది…

రాఖీ సావంత్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది ఈమె. ఎప్పట్లానే ఈసారి కూడా వివాదానికి తన భర్త ఆదిల్ ఖాన్ దురానీనే కారణం అని ఆరోపిస్తోంది రాఖీ. అయితే ఈసారి సమస్య మరింత క్లిష్టమైంది.

ఆదిల్-రాఖీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అందర్లానే వీళ్లు కూడా హనీమూనే చేసుకున్నారు. అయితే ఆ టైమ్ లో రాఖీ సావంత్ ను నగ్నంగా షూట్ చేశాడట ఆదిల్. అలా షూట్ చేసిన న్యూడ్ వీడియోస్ ను దుబాయ్ లో 50 లక్షలకు అమ్మేశాడని ఆరోపిస్తోంది రాఖీ సావంత్.

“అదిల్, నేను హనీమూనే చేసుకున్నాం. ఆ టైమ్ లో నేను బాత్ టబ్ లో ఉన్నప్పుడు ఆదిల్ కొన్ని వీడియోలు తీశాడు. ఆ తర్వాత నేను బూత్ రూమ్ లో నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు మరికొన్ని వీడియోలు తీశాడు. అతడితో కలిసి బెడ్ పై ఉన్నప్పుడు కూడా ఇంకొన్ని వీడియోస్ షూట్ చేశాడు. ఆ వీడియోస్ అన్నింటినీ ఓ అరబ్ వ్యక్తికి రూ.47-50 లక్షలకు అమ్మేశాడు.”

ఇలా ఆదిల్ పై సరికొత్త ఆరోపణలు చేసింది రాఖీ సావంత్. ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా ఆమె వెల్లడించింది. పెళ్లికి ముందే ఆదిల్ తనను లైంగికంగా వేధించాడంటోంది.

“ఓ రోజు ఆదిల్ చెల్లెలు నాకు ఫోన్ చేసింది. కారును బహుమతిగా ఇస్తానంది. ముంబయికి పంపించమని కోరాను. మైసూర్ వచ్చి తీసుకెళ్లమంది. నేను కారు కోసం మైసూర్ వెళ్లాను. ఆదిల్ గదిలో ఉన్నాడని చెప్పారు. నేను లోపలకు వెళ్లాను. అంతలోనే బయట నుంచి ఓ వ్యక్తి లాక్ చేసి వెళ్లిపోయాడు. ఆ టైమ్ లో ఆదిల్ నాపై దాడి చేశాడు.”

గదిలోకి వెళ్లిన తర్వాత ఆదిల్, రాఖీ సావంత్ దుస్తులన్నీ చించేశాడట. 3 గంటల పాటు ఏం చేయాలో అన్నీ చేశాడట. ఆ తర్వాత ఆమెకు సారీ చెప్పాడట. రాఖీ సావంత్ గోవాకు వెళ్తే, అక్కడికి కూడా వెళ్లి, ఒప్పించి పెళ్లి చేసుకున్నాడట.

ఇలా తనకు ఎంతో అన్యాయం చేసిన ఆదిల్ ను తను భర్తగా భావించడం లేదని, అతడి నుంచి విడాకులు కోరుకుంటున్నానని చెప్పింది రాఖీ సావంత్. ఈ వ్యవహారానికి సంబంధించి మరోసారి ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లనుంది.