Advertisement

Advertisement


Home > Movies - Movie News

అయ్యో పాపం.. రకుల్ కు ఇలా జరిగిందేంటి!

అయ్యో పాపం.. రకుల్ కు ఇలా జరిగిందేంటి!

వరుసపెట్టి హిందీ సినిమాలు ప్రకటించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 బాలీవుడ్ సినిమాలు. ఓ టాలీవుడ్ హీరోయిన్ ఇలా వరుసగా హిందీ సినిమాలు చేయడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. రకుల్ అలానే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ప్రాజెక్టు అందిపుచ్చుకోవడంలో ఆమెకు కలిసొచ్చిన అదృష్టం, ఆ సినిమాలు థియేటర్లలో రిలీజైన తర్వాత కలిసి రావడం లేదు. అదే బాధాకరం.

గత నెల రకుల్ నటించిన హిందీ సినిమా ఎటాక్ థియేటర్లలోకి వచ్చింది. జాన్ అబ్రహం, రకుల్ కలిసి చేసిన ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక అదే నెలలో రకుల్ నుంచి ఇంకో సినిమా వచ్చింది. అదే రన్ వే-34. అజయ్ దేవగన్ తో కలిసి రకుల్ ప్రీత్ చేసిన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ఇలా గంపెడశాలతో రకుల్ చేసిన ఈ రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు చతికిలపడ్డాయి. కనీసం యావరేజ్ గా ఆడినా రకుల్ కు ఈ ఏడాది బాలీవుడ్ లో మంచి శుభారంభం దక్కేది. అలా రకుల్ కు అదృష్టం కలిసిరాకుండా పోయింది.

అయితే 2 సినిమాలు పోయినా ఆమె చేతిలో మరో 4 సినిమాలున్నాయి. మిషన్ సిండ్రెల్లా, డాక్టర్-జి సినిమాలు ఆల్రెడీ షూట్ పూర్తిచేసుకున్నాయి. మరో 2 సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ఈ రెండు పోయినా, మిగతా సినిమాల్లో కనీసం ఒక్కటైనా బ్లాక్ బస్టర్ హిట్టయితే, రకుల్ బాలీవుడ్ ఆశలు నెరవేరినట్టే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?