నాగశౌర్య..పక్కా ఫ్యామిలీ సాంగ్

హీరో నాగశౌర్య లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ మాంచి రొమాంటిక్ సాంగ్ బయటకు వచ్చి వైరల్ అయింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసారు.  Advertisement…

హీరో నాగశౌర్య లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ మాంచి రొమాంటిక్ సాంగ్ బయటకు వచ్చి వైరల్ అయింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసారు. 

మొదటి పాటకు ఫుల్ కాంట్రాస్ట్ గా పక్కా సాంప్రదాయ బద్దమైన ఫ్యామిలీ సాంగ్ ను విడుదల చేసారు. అల్ట్రామోడరన్ అమ్మాయి ఓ సాంప్రదాయ కుటుంబంలోకి అడుగిడిన వేళ ఆనందోత్సాహాలు, పెళ్లి సందడులు, సన్నాహాలు అన్నీ ఈ పాటలో సన్నివేశాలుగా చోటు చేసుకున్నాయి.

హీరో నాగశౌర్య, హీరోయిన్ షిర్లే అందంగా కనిపించారు ఈ పాటలో. ఏముందిరా..ఈ అద్భుతాన్ని..అంటూ హర్ష రాసిన పాటను హరిచరణ్ ఆలపించారు. మహతి స్వరసాగర్ మంచి ట్యూన్ తో పాటు సరైన ఇనుస్ట్రుమెంటేషన్ ను అందించారు. దాదాపు సినిమాలోని టోటల్ కాస్ట్ అండ్ క్రూ ఈ పాటలో కనిపించారు. చిత్రీకరణ ఆద్యంతం రిచ్ గా కలర్ ఫుల్ గా వుంది.

అనీష్ కృష్ణ డైరక్షన్ లో ఉష మాల్పూరి నిర్మించిన ఈ సినిమాకు శంకర్ ప్రసాద్ సమర్పకుడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య లాంటి పలువురు ఈ సినిమాలో నటించారు.