తను వీగన్ గా మారి ఏడాది గడించిందని రెండ్రోజుల కిందట చెప్పినట్టుగా ఉంది నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ భామకు బ్రేక్ కాస్త లేట్ గానే వచ్చినా, తెలుగులో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేసింది. హిందీలోనూ ఉనికి చాటుకుంది. ఇప్పటికీ ఈమె కెరీర్ బాగానే సాగుతూ ఉంది.
ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కు కూడా హాజరైనట్టుగా ఉంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై జరిగిన విచారణలో భాగంగా కదలిన డ్రంగ్స్ డొంకతో కొంతమంది నటీమణులు ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. వారిలో రకుల్ కూడా ఒకరు.
అయితే వీరు ఎన్సీబీకి ఏం చెప్పారో, ఎన్సీబీ వీరికి ఏం చెప్పిందో ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్సీబీ అభియోగాల మేరకు మరో నటి రియా చక్రబర్తిని అరెస్టు చేసినా, ఆమె కూడా బెయిల్ పై విడుదలయ్యింది.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. తను వీగన్ అని రకుల్ సగర్వంగా చెప్పుకుంటోంది. వీగన్ ఉండటం అంటే మాటలు కాదు. జంతు, పక్షి సంబంధమైన ఫుడ్ లో దేన్నీ తీసుకోవడానికి లేదు. చికెన్, మటన్ తో పాటు ఎలాంటి మాంసాహారం తీసుకునేది ఉండదు, పాలు, పెరుగు కూడా బంద్!
ఇలాంటి పద్ధతిని పలువురు సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. క్రికెటర్ విరాట్ కొహ్లీ ఈ భయంకర క్రమశిక్షణను ఫాలో అవుతున్నాడు. నటి అమల కూడా చాలా కాలంగా వీగన్ గానే ఉన్నారట. నేటి తరం ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారం చూసినా, ఔట్ సైడ్ దొరికే ఫుడ్ మెనూను పరిశీలించినా.. నాన్ వెజ్ తినకుండా ఉండటం అసలు సాధ్యం అయ్యేది కాదు.
వారం లో ఒకటీ రెండ్రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండటమే చాలా మందికి గగనం అయిపోయింది. మీట్ వినియోగంలో ఇండియా పీక్ స్టేజ్ కు వెళ్లిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ.. యుక్త వయసులోనే ఉండి వీగన్ లుగా మారే వాళ్ల జిహ్వ నియంత్రణను మెచ్చుకోవచ్చు! వాళ్ల ఆరోగ్యం కోసమే అయినా.. వారి స్వీయ నియంత్రణ గొప్ప సంగతే!
మరి అలాంటి రకుల్ ప్రీత్ ను ఏకంగా డ్రగ్స్ వ్యవహారంలోకి లాగారా? మాంసాహారమే గాక, కాఫీ, టీల కు కూడా దూరంగా ఉండే ఆమెను ఏకంగా డ్రగ్స్ రొచ్చులోకి లాగే ప్రయత్నం జరిగిందా? ఎలాగైతేనేం.. ప్రస్తుతం అయితే ఆ వ్యవహారం నుంచి కూడా రకుల్ త్వరగానే బయటపడి, కెరీర్ మీద ఫోకస్ చేసినట్టుగా ఉంది!