బాయ్‌ఫ్రెండ్‌కు బాలీవుడ్ నటి అంకితా లోఖండే సారీ చెప్పారు. అయితే క్షమాపణ చెప్పడానికి ఆమె తప్పేం చేయలేదు. తన వల్ల అతను విమర్శలపాలు అవుతున్నారనే బాధతోనే ఆమె అలా చెప్పారని అర్థం చేసుకోవచ్చు.
సుశాంత్ ఆత్మహత్య తర్వాత అంకిత పేరు వార్తల్లో నిలిచింది. మొట్ట మొదట పవిత్ర రిప్తా సీరియల్ ద్వారా గ్లామర్ రంగంలో ఆమె అడుగు పెట్టారు. ఈ సీరియల్‌లో సుశాంత్ ఆమెతో కలిసి నటించారు.
ఆ పరిచయమే వాళ్లిద్దరి మధ్య ప్రేమను చిగురింపజేసింది. దాదాపు ఏడేళ్ల పాటు వాళ్ల ప్రేమ ప్రయాణం సాగింది. ఏడడుగులు నడవాల్సిన ప్రేమ ప్రయాణానికి బ్రేక్ పడింది. మనస్పర్థల కారణంగా విడిపోయారు.
ఈ క్రమంలో 2019లో మణికర్ణిక చిత్రంతో ఆమె సినిమా రంగంలో ప్రవేశించారు. సినిమాలకు సంబంధించి ఆమెది శైశవ జీవితమనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో తన సోల్‌మేట్, బాయ్ ఫ్రెండ్ విక్కిజైన్‌కు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ధన్యవాదాలతో పాటు క్షమాపణలు చెబుతూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనలాంటి పబ్లిక్ ఫిగర్‌తో కలిసి ఉండటం వల్లే విక్కి విమర్శలను ఎదుర్కో వాల్సి వస్తోందని ఆమె వాపోయారు.
కానీ విమర్శలకు అతను ఏ మాత్రం అర్హుడు కాదని ఆమె తేల్చి చెప్పారు. సుశాంత్‌తో ప్రేమాయణం సాగించిన అంకిత , ప్రస్తుతం విక్కితో సన్నిహితంగా మెలగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంకితకు విక్కిజైన్ సరైన జోడి కాదంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు.
‘నిన్ను చూసిన ప్రతిసారి నా మదిలో దేవుడికి కృతజ్ఞతలు చెబుతాను. కానీ నీ పట్ల నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు దొరకడం లేదు. ఎందుకంటే నీ లాంటి మంచి వ్యక్తిని నా స్నేహితుడిగా, భాగస్వామిగా, సోల్‌మెట్‌గా పంపినందుకు.
అన్ని వేళలా నీవు నాకు తోడుగా అండగా నిలిచావు. నా సమస్యలన్నింటిని నీవిగా భావించి అవసరమైన ప్రతిసారి సాయం అందించావు. నన్ను, నా సమస్యలని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అంకిత ఓ పోస్టు షేర్ చేశారు.
అలాగే విక్కి జైన్‌తో కలిసి ఉన్న ఫొటోని షేర్ చేశారామె. మనసులోని ఫీలింగ్స్‌ను భావోద్వేగంగా ప్రకటించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.