సినిమా నిర్మాణం వైపు హీరోయిన్ చూపు

హీరోయిన్ కెరీర్ చాలా చిన్నది. కెరీర్ మసకబారిన తర్వాత ఏం చేయాలి? ఈ విషయంలో హీరోయిన్లందరికీ ప్లాన్-బి ఉండాలంటోంది రకుల్ ప్రీత్ సింగ్. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఇప్పటికే తోటి హీరోయిన్లకు సలహాలు-సూచనలు…

హీరోయిన్ కెరీర్ చాలా చిన్నది. కెరీర్ మసకబారిన తర్వాత ఏం చేయాలి? ఈ విషయంలో హీరోయిన్లందరికీ ప్లాన్-బి ఉండాలంటోంది రకుల్ ప్రీత్ సింగ్. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఇప్పటికే తోటి హీరోయిన్లకు సలహాలు-సూచనలు అందించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హీరోయిన్ల బ్యాకప్ ప్లాన్స్ పై స్పందించింది.

హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న టైమ్ లోనే ఇష్టమైన రంగంపై దృష్టి సారించాలని సూచిస్తోంది రకుల్. అది ఏ రంగంమైనా మనసుకు నచ్చినదై ఉండాలంటోంది. ఇక తన విషయానికొస్తే.. నటించడం తగ్గించిన తర్వాత సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించింది.

“లెక్కల్లో నేను స్ట్రాంగ్. కాబట్టి భవిష్యత్తులో చేస్తే సినిమా నిర్మిస్తానేమో. అంతేతప్ప దర్శకత్వం మాత్రం చేయను. నేను దర్శకత్వం వహించలేను. డబ్బుల లెక్కలు కావాలంటే చూసుకోగలను. సినిమా రంగంలోనే ఎంచుకోమని అడిగితే ఫిలిం ప్రొడక్షన్ నే నేను సెలక్ట్ చేసుకుంటాను.”

ఇలా నిర్మాణ రంగంపై తనకు అభిరుచి ఉన్న విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది రకుల్. మరికొన్ని రోజుల్లో జాకీ భగ్నానీని వివాహం చేసుకోబోతోంది. అతడు బాలీవుడ్ లో నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సో.. పెళ్లి తర్వాత భర్త అడుగుజాడల్లో నడవాలని భావిస్తోంది రకుల్.