సినిమాతో సక్సెస్ కొట్టడం మరీ జాక్ పాట్ వ్యవహారంగా మారింది. ఏ సినిమా సక్సెస్ అవుతుందో, ఏది బాల్చీ తన్నేస్తుందో అస్సలు చెప్పలేని రోజులివి. ఒక ట్రెండ్ అంటూ లేదిప్పుడు. ఇలాంటి టైమ్ లో వచ్చింది 'ఊరు పేరు బైరవకోన'.
భారీ ప్రచారంతో పాటు, పాజిటివ్ ఫీల్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు సక్సెస్ అయింది. ప్రీమియర్స్ ఇచ్చిన ఉత్సాహాన్ని తొలి రోజు వసూళ్లు కంటిన్యూ చేశాయి. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 3 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. సినిమా బడ్జెట్ తో పోల్చి చూసుకుంటే, మొదటి రోజు వసూళ్లను మంచి నంబర్ గా చెప్పుకోవాలి.
సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. రిపబ్లిక్ డే మూవీస్ కూడా వెళ్లిపోయాయి. అంచనాలతో వచ్చిన ఈగల్ లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి టైమ్ లో వచ్చింది 'ఊరు పేరు బైరవకోన'. ప్రస్తుతం ఆడియన్స్ కు ఈ సినిమా తప్ప మరో ఆప్షన్ లేదు.
సో.. సందీప్ కిషన్ సినిమాకు బోణీ బాగుంది. ఇక ఈ ఉపును ఇలా కొనసాగించడం మాత్రమే మిగిలింది. అంచనాలకు తగ్గట్టే ఈరోజు బుకింగ్స్ బాగున్నాయి. రేపు కూడా మంచి వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది మూవీ. ఎటొచ్చి ఈ సినిమాకున్న ఏకైక అడ్డంకి ఎగ్జామ్స్ సీజన్. అది దాటితే సినిమా గట్టెక్కినట్టే.