కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే తన అభిప్రాయాన్ని వెల్లడించింది రకుల్ ప్రీత్. ఇప్పుడు దీంతో పాటు బాడీషేమింగ్ పై కూడా రియాక్ట్ అయింది. మనం లూజ్ గా ఉంటే ఎవరైనా అవకాశం తీసుకుంటారని, మనం ఎలా ఉన్నామనే అంశంపైనే కాస్టింగ్ కౌచ్ ఆధారపడి ఉంటుందంటోంది.
“మనం ఎలా ఉంటున్నామనేది కాస్టింగ్ కౌచ్ విషయంలో చాలా ముఖ్యం. ఆఫర్ కు తలొగ్గితే ఒక రకం, వద్దనుకుంటే మరో రకమైన పరిస్థితి. ఈ సంగతి పక్కనపెడితే.. తెరచాటు వ్యవహారాలకు ఓకే చెబుతారనే ఉద్దేశంతో ఎవరూ హీరోయిన్ ను సినిమాలోకి తీసుకోరు, కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీయరు. ఒకవేళ అలాంటి భ్రమల్లో ఎవరైనా ఉంటే వెంటనే బయటకు వచ్చేయాలి. కాస్టింగ్ కౌచ్ వల్లనే ఆఫర్లు వస్తాయనుకుంటే అది అబద్ధం.”
కెరీర్ స్టార్టింగ్ లో బాడీ షేమింగ్ కు సంబంధించి తను కూడా విమర్శలు ఎదుర్కొన్నానంటోంది రకుల్. తన ముఖం బాగాలేదని, రొటీన్ ఫేస్ ఉందని చాలామంది విమర్శించారని.. కొంతమందైతే తనను ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకోమని సలహాలిచ్చారని చెప్పుకొచ్చింది. ఇక సెక్స్ అనేది ఎక్కడైనా ఉందని.. తనపై సెక్సిజం ఎప్పుడూ జరగలేదంటోంది.
“నా కెరీర్ లో సెక్సిజం అనేది ఎప్పుడూ జరగలేదు. ప్రతి చోట నన్ను చక్కగానే ట్రీట్ చేశారు. మంచి సినిమా యూనిట్స్ తో పనిచేశాను నేను. సౌత్ లో అయితే మహిళల్ని ఇంకాస్త ఎక్కువ గౌరవిస్తారు. కాబట్టి నాకు చాలా గౌరవం దక్కింది. ఇక పని, రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. ఆ సినిమాకు మన పని ఎంత ఉంది, అందులో మనం సినిమాకు ఎంత కీలకం, ఎన్ని కాల్షీట్లు ఇస్తున్నామనే అంశాలపై నా రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంది.”
కెరీర్ స్టార్టింగ్ లో తనను కూడా 2-3 సినిమాల నుంచి తప్పించారంటోంది రకుల్. ఇలాంటివి ఇప్పటికీ తను ఎదుర్కొంటున్నానని, వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని అంటోంది. దేవుడి దయవల్ల తనను రిజెస్ట్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయంటోంది రకుల్