ఈ కరోనా టైమ్ లో ప్రజలంతా అష్టకష్టాలు పడుతుంటే, మరోవైపు అత్యాచారం కేసులు మాత్రం తగ్గడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది హీరోయిన్ రకుల్ ప్రీత్. ఓవైపు కరోనా కష్టాలు చూస్తూ, మరోవైపు వార్తా పత్రికల్లో రేప్ కేసులకు సంబంధించిన వార్తల్ని చదువుతుంటే రక్తం మరిగిపోతోందని చెప్పుకొచ్చింది.
“రీసెంట్ గా మనేసర్ లో జరిగిన ఓ రేప్ కేసు గురించి చదివాను. ఆ వార్త చదవగానే నా రక్తం మరిగిపోయింది. ఓవైపు కరోనాతో ప్రజలు చచ్చిపోతుంటే, మరోవైపు కొంమతంది ఇలా ప్రవర్తిస్తుంటే చాలా కోపం వస్తోంది. ఇలాంటివి చదివినప్పుడు మనం అసలు మనుషులమేనా అనే సందేహం కలుగుతుంది.”
ఇలా రేప్ కేసులపై తన ఆవేదనను, కోపాన్ని వ్యక్తంచేసింది రకుల్ ప్రీత్. ఈ కరోనా కష్టకాలంలో కొంతమంది ప్రజల్లో మానవత్వం బయటకొస్తోందని, చాలామంది తమకు తోచిన రీతిలో సహాయం చేస్తున్నారని.. అదే టైమ్ లో కొంతమంది ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని బాధపడింది రకుల్.
“మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏం సాధించాం అనేది మరిచిపోండి. ఓ సమాజంలో ఉన్నాం. ఇతర వ్యక్తులు కూడా మనతోనే ఉన్నారనే విషయాన్ని గ్రహించాలి. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే అందర్నీ సమానంగా చూడగలుగుతాం. చిన్న విషయాల్ని పట్టించుకున్నప్పుడు, చిన్న వ్యక్తులకు కూడా గౌరవం ఇచ్చినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది.”
ప్రస్తుతం ఈ హీరోయిన్ కరోనా రోగుల కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమం మొదలుపెట్టింది. ఇంత పెద్ద విపత్తులో తన ఒక్కరి సాయం ఏ మూలకు సరిపోదని, అంతా చేతులు కలపాల్సిన సమయం వచ్చిందని అంటోంది.