ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హీరో రామ్ రేంజ్ మారిపోయింది. తొలిసారి భారీ సినిమా చేస్తున్నాడు. భారీ ఖర్చు. భారీ మార్కెటింగ్ కూడా. మాస్ డైరక్టర్ లింగు స్వామి తో చేస్తున్న వారియర్ సినిమా ఫిగర్స్ అన్నీ భారీగానే వున్నాయి.
సినిమా నిర్మాణానికే 70 కోట్లకు పైగా ఖర్చు చేసారు అంటే కాస్త ఆశ్చర్యమే. రెమ్యూనిరేషన్ లు, సెట్ లు, యాక్షన్ సీక్వెన్స్ లు, మిగిలిన వన్నీ కలుపుకుంటే 70 కోట్లకు పైగానే ఖర్చయినట్లు తెలుస్తోంది. రామ్ కెరీర్ లో ఇది హయ్యస్ట్ అనుకోవాలి.
అలాగే సినిమా మార్కెట్ కూడా అదే రేంజ్ లో చేసారు. ఆంధ్ర 17 కోట్ల రేంజ్ లో క్లోజ్ చేసారు. నైజాం బేరం తెగాల్సి వుంది. నిర్మాత 16 కోట్లు ఆశిస్తున్నారు. కానీ ఏ మేరకు వస్తుందన్నది చూడాలి.
థియేటర్ అంతా కలిపి 40 కోట్ల మేరకు మార్కెట్ చేస్తున్నారు. నాన్ థియేటర్ మీద 32 కోట్లకు పైగా రాబట్టారట. మొత్తం మీద మంచి మార్జిన్ కనిపిస్తోంది.
గమ్మత్తేమిటంటే లింగుస్వామిని మరో సినిమాకు కూడా ఇదే బ్యానర్ లాక్ చేసింది. వారియర్ సినిమా తరువాత ఇదే బ్యానర్ లో బోయపాటి..రామ్ కాంబినేషన్ సినిమా వుండడంతో మార్కెటింగ్ సులువు అయినట్లు కనిపిస్తోంది.
వారియర్ ట్రయిలర్ శుక్రవారం అనంతపురంలో లాంచ్ చేస్తున్నారు. లింగుస్వామికి తెలుగులో ఇది తొలి డైరెక్ట్ సినిమా.