మనిషికి వేదాంతం ఎపుడు పుడుతుందంటే
1. క్యాబ్ బుక్ చేసినపుడు, అది వస్తుందో రాదో తెలియకుండా Wait చేస్తున్నపుడు
2. సర్వీస్ ఆటోలో వున్నపుడు అది గోతులు ఎక్కుతూదిగుతూ నిలదొక్కుకుంటున్నపుడు
3. ఒకటో తేదీ వచ్చే జీతం ఏదో ఒక తేదీ వస్తున్నపుడు
4. షాపింగ్ మాల్లో ఒక చీర కొనడానికి, 200 చీరల్ని భార్య పరిశీలిస్తున్నపుడు
5. ఎంట్రీ ఫ్రీ, ఎగ్జిట్కి టికెట్ అని థియేటర్ వాడు చెప్పినపుడు
6. మాల్లో 500 రూపాయల పాప్కార్న్ బకెట్ కొనమని పిల్లలు గోల చేసినపుడు
7. ప్రపంచ శాంతి మీద జరుగుతున్న డిబేట్లో వ్యక్తులు కొట్టుకున్నపుడు
8. మిల్టరీ మందు కూడా కల్తీ చేశారని తెలిసినపుడు
9. రాజకీయ నాయకులు సత్యం గురించి ఉపన్యాసాలు చెబుతున్నపుడు
10. సినిమా సభల్లో ఒకర్నొకరు పొగుడుకుంటున్నపుడు
11. ఎన్ని కథలు చెప్పినా, కొత్త కథ ఏదైనా చెప్పమని నిర్మాత అన్నపుడు
12. ప్రొడక్షన్లో టీ ఇస్తూ, హీరో అయిపోదామని కలలు గనే కుర్రాన్ని చూసినపుడు
జీఆర్ మహర్షి