రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) సెన్సార్ పూర్తి

దేశ భక్తిని చాటే చిత్రాలకు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ ఓ పాజిటివ్ కోణం ఉంటుంది. పేట్రియాటిక్ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులెప్పుడూ సిద్దంగా ఉంటారు. ఈ రిపబ్లిక్ డేకి అలాంటి ఓ దేశ భక్తిని చాటే…

దేశ భక్తిని చాటే చిత్రాలకు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ ఓ పాజిటివ్ కోణం ఉంటుంది. పేట్రియాటిక్ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులెప్పుడూ సిద్దంగా ఉంటారు. ఈ రిపబ్లిక్ డేకి అలాంటి ఓ దేశ భక్తిని చాటే చిత్రం రాబోతోంది. రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అంటూ మంచి సందేశాత్మక చిత్రంగా అందరినీ అలరించబోతోంది.

దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు.

ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 144 నిమిషాల (రెండు గంటల 24 నిమిషాలు) నిడివితో రాబోతోన్న ఈ చిత్రం 40 నిమిషాలు యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయని, మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు.

ఈ చిత్రానికి ధారన్ సుక్రి విజువల్స్, ఆశ్రిత్ సంగీతం హైలెట్ కానున్నాయి. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న భారీ ఎత్తున విడుదల కానుంది.