Advertisement

Advertisement


Home > Movies - Movie News

మా రామ్ చరణ్ లీకులకు కూడా పనికిరాడా!

మా రామ్ చరణ్ లీకులకు కూడా పనికిరాడా!

పైత్యం ప్రకోపిస్తే ఇలాంటి పిచ్చి వితండవాదాలే పుట్టుకొస్తాయి. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ వ్యవహారశైలి ఇలానే ఉంది. మా రామ్ చరణ్ లీకులకు కూడా పనికిరాడా అంటూ ప్రశ్నిస్తున్నారు అతడి ఫ్యాన్స్. దీంతో అంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పటివరకు వస్తున్న లీకులన్నీ ఎన్టీఆర్ వే. రామ్ చరణ్ గెటప్ కు సంబంధించి పెద్దగా ఎలాంటి లీకులు లేవు. ఈ విషయంలో అతడి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. లీకుల్లోనైనా తమ హీరోనే ముందుండాలంటున్నారు వీళ్లు.

ఈమధ్య ఎన్టీఆర్ కు సంబంధించి ఆర్ఆర్ఆర్ కీలక సన్నివేశం ఒకటి లీకైంది. పులి ఫైట్ కు సంబంధించిన సీన్ అది. అందులో ఎన్టీఆర్ చిరుతలా పరుగెత్తుతున్నాడు. అతడి లుక్ కూడా వైరల్ అయింది. లీక్ అయితే అయింది కానీ తారక్ కు భారీ పాపులారిటీ వచ్చేసింది. అలాంటి పాపులారిటీనే తమ హీరోకు కూడా కావాలనేది చరణ్ అభిమానుల డిమాండ్.

అందుకే ఎవరైనా ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ క్లిప్స్ కూడా లీక్ చేయండంటూ సోషల్ మీడియాలో అతడి ఫ్యాన్స్ వరుసగా పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ కు వచ్చినలాంటి పబ్లిసిటీని తమ హీరోకు కూడా కల్పించమని కోరుతున్నారు. ఇది పిచ్చి కాక మరేంటి. ఇలా లీకుల విషయంలో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ పోటీపడితే అది మొత్తం సినిమాకే డ్యామేజీగా మారుతుంది.

అయితే ఈసారి చరణ్ లుక్ లీక్ అవ్వడం కాదు, అఫీషియల్ గానే రిలీజయ్యే అవకాశాలున్నాయి. అటుఇటుగా నెల రోజుల్లో రామ్ చరణ్ పుట్టినరోజు ఉంది. ఆ సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి చరణ్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. సినిమా స్టార్ట్ చేసి అప్పటికి ఏడాది అవుతుంది కాబట్టి ఈసారి ఫస్ట్ లుక్ రావడం గ్యారెంటీ.

నా మీదనే దాడి చేయిస్తావా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?