ఆర్ఆర్ఆర్ ముందు నుంచే మెగా ఫ్యామిలీతో ఎన్టీఆర్ బంధం పెనవేసుకుని వుంది. ఆర్ఆర్ఆర్ తో ఆ బంధం మరింత బలపడింది.
ఇప్పుడు మరోసారి ఆ స్నేహబంధం తెరపై కనిపించబోతోంది. అయితే పెద్ద తెరపై కాదు. బుల్లి తెరపై.
ఎన్టీఆర్ తొలిసారి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఎపిసోడ్ ల షూట్ ప్రారంభం అయింది.
కామన్ మాన్ లతో పాటు మధ్య మధ్యలో సెలబ్రిటీలు కూడా హాట్ సీట్ లోకి రావడం అన్నది కార్యక్రమానికి బజ్ తెచ్చే ప్లాన్ లో భాగం.
అందులో భాగంగా రామ్ చరణ్ హాట్ సీట్ లోకి రాబోతున్నారు. ఈ మేరకు ప్లాన్ చేసిన ఎపిసోడ్ ను ఈ రోజు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుంది.
ఇప్పట్లో వాడతారా? లేక ఆర్ఆర్ఆర్ విడుదల టైమ్ వరకు అలా దాచి వుంచుతారా? అన్నది తెలియాల్సి వుంది.