ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల జరిగిన ఫస్ట్ ప్రయోజనం ఏమైనా వుందా అంటే అది రామ్ చరణ్, ఎన్టీఆర్ లను వంద కోట్ల హీరోలను చేసేయడం. తరువాత సంగతి తరువాత తెలుస్తుంది కానీ ఇప్పుడు ఇద్దరూ ఇదే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది.
ఎన్టీఆర్ -కొరటాల శివ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్యానర్ వుంది కనుక లెక్కలు ఇప్పుడే తెలియవు. కానీ రామ్ చరణ్-శంకర్ సినిమా కు మాత్రం హీరో రెమ్యూనిరేషన్ వంద కోట్లు అని అత్యంత విశ్వసనీయ వర్గాల బోగట్టా.
సుమారు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారీ సినిమాను. పాటల చిత్రీకరణకు కోట్లకు కోట్లు ఖర్చు చేసారు ఇప్పటికే. షూటింగ్ వర్కింగ్ డేస్ కూడా చాలా ఎక్కువ. అందువల్ల నిర్మాణ వ్యయం ఓ లెక్కలో జరుగుతోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ కు 100 కోట్ల రెమ్యూనిరేషన్ ను నిర్మాత దిల్ రాజు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రభాస్..బన్నీ వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు రెమ్యూనిరేషన్ పరంగా. ప్రశాంత్ నీల్ తో సినిమా అప్ డేట్ వచ్చేసరికి ఎన్టీఆర్ కూడా అదే దారిలో వుంటారు. మహేష్ బాబు ప్రస్తుతం 60 కోట్ల రేంజ్ లో వున్నారు కానీ రాజమౌళి సినిమాతో 100 కోట్ల క్లబ్ మెంబర్ షిప్ తీసేసుకుంటారు. అంటే మన టాప్ యంగ్ హీరోలు అంతా 100 కోట్ల హీరోలుగా మారిపోయినట్లే.
పాన్ ఇండియా సినిమాల మహాత్యం అనుకోవాలేమో?