రామ్ చరణ్- మరో పాన్ ఇండియా సినిమా

ఆర్ఆర్ఆర్‌తో రామ్ చరణ్ ఇండియా వైడ్ గా మారుమోగింది. గతంలో బాలీవుడ్ సినిమా ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. కానీ అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. పైగా అప్పుడు చేసిన రీమేక్ వేరు.…

ఆర్ఆర్ఆర్‌తో రామ్ చరణ్ ఇండియా వైడ్ గా మారుమోగింది. గతంలో బాలీవుడ్ సినిమా ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. కానీ అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. పైగా అప్పుడు చేసిన రీమేక్ వేరు.

ఆర్ఆర్ఆర్ తరువాత శంకర్ తో గేమ్ ఛేంజర్ అంటూ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అలాగే ఉప్పెన బుచ్చిబాబుతో మరో పాన్ ఇండియా స్టార్ట్ కాబోతోంది.

ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో ఓ సినిమా చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ కమిట్ మెంట్ దేనికోసం అన్నది క్లారిటీ లేదు. మల్టీ స్టారర్ నా? సోలో సినిమానా? అన్నది తెలియాల్సి వుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఓ మల్టీ స్టారర్ చేస్తున్నాడు. చరణ్ కూడా అలాగే చేస్తాడా? లేదంటే బుచ్చిబాబు సినిమా తరువాత సోలో సినిమా చేస్తాడా అన్నది కొన్నాళ్ల తరువాత కానీ తెలియదు.

మొత్తానికి మన హీరోలు కూడా పాన్ ఇండియా పుణ్యమా అంటూ రెండు మూడేళ్లకు ముందుగా ప్లానింగ్ చేస్తున్నారు. అందువల్ల అన్ని వివరాలు తెలియడానికి చాలా టైమ్ పడుతుంది.