తమిళనటుడు మణికందన్ నటించిన సినిమా ట్రూ లవర్స్. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్. తమిళంలో నిర్మించిన సినిమాను తెలుగులో దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ కలిపి తమ తమ బ్యానర్లపై అందిస్తున్నారు. శనివారం ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో “ట్రూ లవర్” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో మణికందన్ మాట్లాడుతూ – ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ తప్ప ఇంకేం మాట్లాడలేను. తెలుగు నటుడిగానే నన్ను ఇక్కడి వాళ్లు రిసీవ్ చేసుకుంటున్నారు. నేను జై భీమ్, గుడ్ నైట్ చేసినప్పుడు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రిసెప్షన్ వచ్చింది. తమిళ ప్రీమియర్స్ లాగే తెలుగులోనూ సక్సెస్ ఫుల్ టాక్ రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో ప్రతి సీన్ మరో సీన్ తో లింక్ అయి ఉంటుంది. మీరు ఒక్క సీన్ చూడకున్నా.. ఏం జరిగింది అనేది మిస్ అవుతారు. అంత పక్కాగా స్క్రీన్ ప్లే చేసిన సినిమా ఇది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న తెలుగువారికి రుణపడి వుంటా అన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – తమిళ ప్రీమియర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ ఉంది. తెలుగులోనూ సూపర్ హిట్ చేస్తారని నమ్ముతున్నాం. ఒక మంచి సినిమా చేశామనే సంతృప్తి మా టీమ్ అందరిలో ఉంది. అదే నమ్మకంతో ఈ మూవీ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. అన్నారు.
సినిమాను తెలుగులో అందిస్తున్న దర్శకుడు మారుతి మాట్లాడుతూ – నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కలిగిందో తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్ లు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. “ట్రూ లవర్” సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్ గా తెరకెక్కించాడు. చాలా డీప్ గా థింక్ చేసి స్క్రిప్ట్ చేశాడు. డైరెక్టర్ గా ప్రభురామ్ వ్యాస్ టాలెంట్ ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా మూవీ చూడొచ్చు. ఈ సినిమాతో ఈ వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను అన్నారు.
నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల కాలంలో ఇలాంటి మంచి లవ్ స్టోరి రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని నమ్మకం వుంది.. శుక్రవారం రాత్రి సెలబ్రిటీలు, మీడియాకు కూకట్ పల్లి విశ్వనాథ్ థియేటర్ లో షో వేస్తున్నాం. మరికొన్ని థియేటర్స్ లో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. ఈ సినిమా మీద అతి తక్కువ టైమ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్, కూకట్ పల్లిలో విశ్వనాథ్ వంటి మంచి థియేటర్స్ దొరికాయి. మణికందన్ తమిళ హీరో అయినా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పారు. శ్రీ గౌరి ప్రియ తెలుగు అమ్మాయి..తమిళం నేర్చుకుని డబ్బింగ్ చెప్పింది. వీళ్లు ఇంత కమిటెడ్ గా సినిమా కోసం పనిచేశారు. అలాగే డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ కు ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా ఆఫర్స్ వస్తాయని అన్నారు
ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “ట్రూ లవర్” సినిమా తమిళ ప్రీమియర్స్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. తెలుగులోనూ అదే రెస్పాన్స్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. “ట్రూ లవర్” సినిమా చూస్తున్నంతసేపు అబ్బాయిలైతే తమ జీవితాల్లో ఇలాగే జరిగింది అనుకుంటారు. అమ్మాయిలకూ బాగా నచ్చే సినిమా అవుతుంది. అన్నారు.