స్కంద నుంచి పూర్తిగా బయటకొచ్చిన హీరో

ఫ్లాప్ నుంచి బయటకురావడానికి ఒక్కో హీరో ఒక్కో రకంగా ట్రై చేస్తుంటారు. కొంతమంది హీరోలు ఫ్లాప్స్ ను లైట్ తీసుకుంటే, మరికొంతమంది హీరోలు ఓ పట్టాన దాన్ని జీర్ణించుకోలేరు. హీరో రామ్ మాత్రం ఈసారి…

ఫ్లాప్ నుంచి బయటకురావడానికి ఒక్కో హీరో ఒక్కో రకంగా ట్రై చేస్తుంటారు. కొంతమంది హీరోలు ఫ్లాప్స్ ను లైట్ తీసుకుంటే, మరికొంతమంది హీరోలు ఓ పట్టాన దాన్ని జీర్ణించుకోలేరు. హీరో రామ్ మాత్రం ఈసారి ఫాస్ట్ గానే ఫ్లాప్ నుంచి కోలుకున్నట్టు కనిపిస్తోంది.

స్కంద సినిమా రిలీజైన టైమ్ కు ఫారిన్ వెకేషన్ లో ఉన్నాడు రామ్. ఆ సినిమా సక్సెస్ అయితే వెంటనే ఇండియా రావాలనేది అతడి ప్లాన్. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొనాలని అనుకున్నాడు. కానీ స్కంద సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో రామ్ తన విదేశీ పర్యటనను మరింత పొడిగించుకున్నాడు.

స్కంద ఫ్లాప్ తో ఈ హీరో మరికొన్నాళ్లు విదేశాల్లోనే ఉంటాడని, పూర్తిగా ఆ బాధ నుంచి బయటకొచ్చిన తర్వాత, అప్పుడు ఇండియాకు వస్తాడని చాలామంది అనుకున్నారు. కానీ రామ్ మాత్రం తొందరగానే కోలుకున్నాడు.

విదేశీ పర్యటన ముగించుకొని ఇండియాకొచ్చిన రామ్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా డబుల్ ఇస్మార్ట్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్ షూటింగ్ తాజాగా ముంబయిలో మొదలైంది.

రామ్, మరో సినిమాకు షిఫ్ట్ అవ్వడంతో, అతడు స్కంద పరాజయం నుంచి పూర్తిగా బయటపడినట్టు భావిస్తున్నారు చాలామంది. కొత్త సినిమా పనిలో పడితే, పాత సినిమా బాధల్ని మరిచిపోవడం ఈజీ. విజయ్ దేవరకొండ ఇలానే చేస్తాడు, ఇప్పుడు రామ్ కూడా అదే పని చేసినట్టున్నాడు.