నో ట్వీట్స్.. ఇస్మార్ట్ గా వ్యవహరించిన రామ్

విజయవాడ రమేష్ హాస్పిటల్స్ వ్యవహారంలో అనవసరంగా తలదూర్చిన హీరో రామ్ ఇప్పుడు వెనక్కి తగ్గినట్టు అర్థమవుతోంది. రమేష్ హాస్పిటల్స్ ఘటనపై ఇక తాను ట్వీట్లు వేయను అని తేల్చి చెప్పాడు ఈ హీరో.  న్యాయంపై…

విజయవాడ రమేష్ హాస్పిటల్స్ వ్యవహారంలో అనవసరంగా తలదూర్చిన హీరో రామ్ ఇప్పుడు వెనక్కి తగ్గినట్టు అర్థమవుతోంది. రమేష్ హాస్పిటల్స్ ఘటనపై ఇక తాను ట్వీట్లు వేయను అని తేల్చి చెప్పాడు ఈ హీరో.  న్యాయంపై నాకు నమ్మకం ఉంది. ఎవరైనా, ఎవరికి చెందినవారైనా, నిజమైన దోషులకు శిక్ష పడుతుందని భావిస్తున్నా.. ఇకపై స్వర్ణ ప్యాలెస్ హోటల్ ప్రమాదంపై ఎలాంటి ట్వీట్లు చేయను అని ఓ సరికొత్త ట్వీట్ వేశారు రామ్.

ఇంతకీ రామ్ మనసు ఎందుకు మారింది. ముఖ్యమంత్రి గారూ.. పెద్ద కుట్ర జరిగిపోతోంది, ఓ లుక్కేయండి అంటూ సెటైరిక్ గా ట్వీట్ చేసిన రామ్ ఇప్పుడెందుకు వెనక్కి తగ్గినట్టు. న్యాయంపై నమ్మకం ఉంటే.. అనవసరంగా ఈ వివాదంలోకి ఎందుకొచ్చినట్టు? విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు స్టేట్ మెంట్ తో రామ్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని, దీనికి ఆటంకం కలిగిస్తే ఎంతటివారికైనా నోటీసులు ఇవ్వడానికి వెనకాడబోమని విజయవాడ వెస్ట్ ఏసీపీ సూర్యచంద్రరావు స్పష్టం చేశారు. విచారణ జరుగుతున్నప్పుడు అగ్నిప్రమాదంపై హీరో రామ్ ట్వీట్లు పెట్టడం సరికాదని కూడా ఆయన అన్నారు. డాక్టర్ రమేష్ ని కాపాడేందుకు అసత్య ఆరోపణలతో విచారణకు అడ్డు తగిలితే హీరో రామ్ కి కూడా నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు.

ముఖ్యమంత్రి పేరుని మెన్షన్ చేస్తూ రామ్ ట్వీట్లు వేయడం సరికాదని ఇప్పటికే చాలామంది నెటిజన్లు మండిపడ్డారు. వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాష్ట్ర సమస్యలు పట్టని రామ్, బాబాయ్ ను అరెస్ట్ చేస్తారనగానే రాజకీయాలు మాట్లాడ్డం సరికాదంటూ నెటిజన్లు ఘాటు విమర్శలు చేశారు. ఇలా  సినీ వర్గాలతో పాటు, సామాన్య ప్రజల్లో కూడా రామ్ చేసింది సరైన పని కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో రామ్ ఆలోచనలో పడినట్టున్నాడు.

ఈ వ్యతిరేకత ఓవైపు, అటు పోలీసుల నుంచి పరోక్ష హెచ్చరికలు మరోవైపు. దీంతో తన ట్వీట్ల ప్రక్రియ విరమిస్తున్నట్టు ఓ ట్వీట్ వేసి మరీ చెప్పుకొచ్చారు రామ్. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే నెగెటివ్ వచ్చినా కొందమందికి సీటీ స్కాన్ లో కొవిడ్ బైటపడుతోందని, అలాంటివారు సైలెంట్ క్యారియర్స్ గా ఉంటారని ఓ మెసేజ్ ఓరియంటెడ్ ట్వీట్ వేసి, ఆ తర్వాత రమేష్ హాస్పిటల్ వివాదంపై ఇక స్పందించనంటూ మరో ట్వీట్ వేసి ఊరుకున్నాడు ఈ హీరో.

మొత్తమ్మీద ఈ వివాదానికి సంబంధించి రామ్ ఇస్మార్ట్ గానే వ్యవహరించాడు. ఇక తనకు సంబంధం లేదంటూ చేతులు దులిపేసుకున్నాడు. కానీ ఇదే ఆలోచన ట్వీట్లు పెట్టకముందు చేసుంటే బాగుండేది. జనాలకు రామ్ పై ఉన్న అభిప్రాయం ఈ వ్యవహారంతో కాస్త మారింది.

దిల్ రాజు ముందు చూపు

చంద్ర‌బాబు ఆట‌లో పావులు