రామ్ ను వేడెక్కించిన హెబ్బా

రామ్ పోతినేని సంక్రాంతి స్పెషల్ రిలీజ్ 'రెడ్'. ఈ థ్రిల్లర్ సినిమా కోసం ఓ హాట్ ఐటమ్ సాంగ్ ను ప్రత్యేకంగా చిత్రీకరించారు. ఈ సాంగ్ లిరికల్ విడియోను బయటకు వదిలారు.  Advertisement హెబ్బా…

రామ్ పోతినేని సంక్రాంతి స్పెషల్ రిలీజ్ 'రెడ్'. ఈ థ్రిల్లర్ సినిమా కోసం ఓ హాట్ ఐటమ్ సాంగ్ ను ప్రత్యేకంగా చిత్రీకరించారు. ఈ సాంగ్ లిరికల్ విడియోను బయటకు వదిలారు. 

హెబ్బా పటేల్ ఈ పాటలో తన అందాలన్నీ ఆరబోయడమే కాకుండా,  కవ్వింపు భంగిమల్లో కుర్రకారుకు హుషారు రేకెత్తించేలా నృత్యాలు సాగించింది. 

మణిశర్మ సంగీత దర్శకత్వంలో  డింజిక..డింజిక..జింక అంటూ సాగిన ఈ గీతం కోసం రామ్ కూడా కాస్త గట్టిగానే స్టెప్పులేసాడు. ఇస్మార్ట్ శంకర్ తరువాత ఈ తరహా స్టెప్ లకు ప్రాధాన్యత ఇచ్చాడు. కాసర్ల శ్యామ్ మాంచి టెంప్టింగ్ గా లిరిక్స్ అందించాడు.

మొత్తం మీద హెబ్బా హొయలు, కాసర్ల సాహిత్యం, మణిశర్మ మ్యూజిక్ కలిసి ఓ హాట్ నెంబర్ ను తయారుచేసాయి. పండగవేళ ఈ గీతం గట్టిగానే సందడి చేసేలా వుంది.