రామ్ పాన్ ఇండియా పేరుకు మాత్రమేనా?

సలార్ డేట్ మారగానే తొందరపడి స్కంధ సినిమా డేట్ మార్చింది. అది ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, అన్నది పాయింట్. చంద్రముఖి 2 సినిమా వుంది.. సలార్ వాయిదా పడింది.. సోలో డేట్ దొరికింది…

సలార్ డేట్ మారగానే తొందరపడి స్కంధ సినిమా డేట్ మార్చింది. అది ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, అన్నది పాయింట్. చంద్రముఖి 2 సినిమా వుంది.. సలార్ వాయిదా పడింది.. సోలో డేట్ దొరికింది అని అటు వెళ్లారు. అందులో నిర్మాత ప్రమేయం ఏమీ లేదు. అంతా దర్శకుడు బోయపాటి నిర్ణయమే. కాదన అవకాశమే లేదు. 

కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే చంద్రముఖి 2 కూడా వాయిదా పడింది. అంటే సోలో విడుదల చాన్స్ పోయింది. రెండు వారాల సోలో చాన్స్ మిస్ అయింది. పోనీ అని సర్దుకుంటే, నిను వీడని నీడను నేనే అన్నట్లుగా చంద్రముఖి 2 వెళ్లి వెళ్లి మళ్లీ స్కంధ కు పోటీగా రంగంలోకి దిగుతోంది.

దీంతో ఏమయింది. పెనం మీద నుంచి వెళ్లి పొయ్యిలోకి పడినట్లు అయింది. అంతే కాదు. అక్కడ పెదకాపు సినిమా కూడా విడుదల వుంది. అంటే ద్విముఖ పోటీ వదలుకుందాం అనుకుంటే త్రిముఖ పోటీ ఎదురయింది. సరే మన స్ట్రయిట్ సినిమా, పెదకాపుతో పోల్చుకుంటే పెద్ద హీరో, పెద్ద డైరక్టర్ సినిమా, అందువల్ల ఓపెనింగ్ చాన్స్ ఎక్కువ దీనికే వుంటుంది అనుకోవచ్చు. కంటెంట్ ను బట్టే ఏ సినిమా అయినా వుంటుంది అని సరిపెట్టుకోవచ్చు. కానీ కలెక్షన్లు స్ప్లిట్ కావడం అన్నది మాత్రం ఎంతో కొంత తప్పదు.

సినిమా విడుదల తరువాత ఎలా వుంటుందో కానీ ముందు మార్కెట్ మీద మాత్రం ప్రభావం చూపిస్తోంది. ఇప్పటి వరకు వైజాగ్, ఈస్ట్, వెస్ట్, ఒరిస్సా హక్కులు ఏవీ ఎవరికీ ఇవ్వలేదు. ఎందుకంటే రేట్లు, బేరాలు తెగడం లేదు. అయినా నిర్మాతలకు సమస్య లేదు. ఎందుకంటే సినిమా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్. నాన్ థియేటర్ హక్కుల రూపంలో మంచి మొత్తాలు, దాని ద్వారా మంచి లాభాలు వచ్చాయి. అందువల్ల థియేటర్ మార్కెట్ సమస్య లేదు.

అన్నీ బాగానే వున్నాయి కానీ సినిమాను పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేసారు. ప్రతి సారీ అన్ని భాషల కంటెంట్ తో హడావుడి చేస్తున్నారు. కానీ హీరో రామ్ మాత్రం పాన్ ఇండియా ప్రమోషన్ ను పట్టించుకున్నట్లు లేదు. తమిళ, మలయాళ, కన్నడ ప్రాంతాలకు వెళ్లి కాస్త హడావుడి చేయాల్సి వుంది. కానీ అలాంటి ప్రయత్నం ఇప్పటి వరకు కనిపించలేదు. సినిమా విడుదల తొమ్మిది రోజుల్లో వుంది. ఈ లోగా ప్రీ రిలీజ్ హడావుడి వుండనే వుంటుంది.

మరి రామ్ ఎప్పుడు ప్రచారం మొదలుపెడతారో.. సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు ఎప్పుడు చేరుస్తారో చూడాలి.