‘రామారావు’ మీదే చూపు

క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లో ఓ టర్నింగ్. కానీ దాని తరువాత మళ్లీ వెంటనే సరైన హిట్ పడలేదు. ఇలాంటి టైమ్ లో వస్తోంది రామారావు ఆన్ డ్యూటీ.  Advertisement రవితేజ అనగానే…

క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లో ఓ టర్నింగ్. కానీ దాని తరువాత మళ్లీ వెంటనే సరైన హిట్ పడలేదు. ఇలాంటి టైమ్ లో వస్తోంది రామారావు ఆన్ డ్యూటీ. 

రవితేజ అనగానే గతంలో ఒకటే ఒపీనియన్..యాక్షన్ విత్ వెటకారంతో కూడిన ఫన్. కానీ క్రాక్ లో ఆ జాడలు లేవు. కొత్తగా ట్రయ్ చేసాడు. ఖిలాడీలో మళ్లీ ఆ జాడలు వున్నా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు చేస్తున్న రామారావు ఆన్ డ్యూటీ పూర్తిగా భిన్నం.

ఇప్పటి వరకు రవితేజ థ్రిల్లర్ టచ్ వున్న సినిమాలు చేయలేదు. అదే అన్నింటికన్నా కీలకమైన తేడా. అలాగే ఈ మధ్య కొత్త దర్ళకుడితో సినిమా చేయలేదు. ఎప్పుడో బాబి తో చేసారు. ఆ తరువాత ఇదే కావచ్చు. పైగా పూర్తిగా యాక్షన్..ఇన్వెస్టిగేషన్…రేసీ స్క్రీన్ ప్లే వుండే సినిమా అసలు చేయలేదు. 

ఇవన్నీ కలిస్తే రామారావు ఆన్ డ్యూటీ. పేరుగా ఓ ప్రభుత్వ అధికారి పాత్ర అయినా, కోర్ పాయింట్ అంతా క్రయిమ్..ఇన్వెస్టిగేషన్..యాక్షన్ తో కూడిన ఎమోషన్ టచ్ తో వుంటుంది.

జనాలు థియేటర్లను మరిచిపోతున్న రోజుల్లో వస్తోంది రామారావు ఆన్ డ్యూటీ. అంటే సుందరానికి..వారియర్ సినిమాలను కొలమానంగా తీసుకోవాలి అనుకుంది టాలీవుడ్. ఆ సినిమాలకు జనాలను థియేటర్ కు తీసుకువచ్చే సత్తా వుందని భావించారు. కానీ అవి కంటెంట్ వైజ్ విఫలమయ్యాయి. 

ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి రామారావు మీద పడింది. ఎందుకంటే రవితేజ పక్కా మాస్ హీరో. బి సి సెంటర్ల లో టికెట్ తెగడానికి ఆస్కారం వున్న హీరో.

అందుకే ఒక పక్క సినిమా నిర్మాణాలు ఆపే దిశగా ముందుకు వెళ్తూనే, మరోపక్క రామారావు ఎలా వుంటుంది? ఎలా ఫేర్ చేస్తుంది? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్లే ఈసారి రవితేజ ప్రచారం విషయంలో కాస్త కీలకంగానే వున్నారు. 

వీలయినన్ని ఎక్కువ ఇంటర్వూలు ఇచ్చారు. తరచు మీడియా ముందుకు వచ్చారు. దర్శకుడు అయితే ఇక చెప్పనక్కరలేదు. చాలా చాలా మాట్లాడుతూనే వున్నారు.

వీటన్నింటి ఫలితం…ఇండస్టీ ఎదురు చూపు వైనం..అన్నీ మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.