బాలీవుడ్ రీఎంట్రీపై స్పందించిన రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు రామ్ చరణ్. అయితే చరణ్ కు బాలీవుడ్ కొత్త కాదు. చాలా ఏళ్ల కిందటే హిందీలో స్ట్రయిట్ మూవీ చేశాడు. అది కూడా అమితాబ్…

ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు రామ్ చరణ్. అయితే చరణ్ కు బాలీవుడ్ కొత్త కాదు. చాలా ఏళ్ల కిందటే హిందీలో స్ట్రయిట్ మూవీ చేశాడు. అది కూడా అమితాబ్ నటించిన జంజీర్ ను రీమేక్ చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు చెర్రీ.

ఇన్నాళ్లకు తన బాలీవుడ్ రీఎంట్రీపై స్పందించాడు రామ్ చరణ్. హిందీ ప్రాజెక్టుకు సంబంధించి తను ఏ దర్శకుడ్ని సినిమా చేద్దామని అడగనని క్లారిటీ ఇచ్చాడు. ఏదైనా పాత్రకు తను సూట్ అవుతానని భావిస్తే, బాలీవుడ్ దర్శకులే తన వద్దకు వస్తారని అంటున్నాడు. దీనికి సరైన లాజిక్ కూడా చెబుతున్నాడు చరణ్.

“మనం దర్శకుల్ని సెలక్ట్ చేసుకోకూడదు. దర్శకులే మనల్ని ఎంపిక చేసుకోవాలి. ఓ సినిమా చేద్దామని నేను ఏ దర్శకుడ్ని అడగను. అలా చేస్తే ఆ సినిమా వర్కవుట్ అవ్వదు. మేకర్స్ తమ కథల్లో నన్ను చూడాలి. ఓ కథ, అందులో పాత్ర నన్ను డిమాండ్ చేయాలి. అప్పుడు ఆ సినిమా పండుతుంది. అంతేతప్ప,  లవ్ స్టోరీ చేద్దాం, జేమ్స్ బాండ్ టైపు సినిమా చేద్దామని ప్లాన్స్ వేసుకుంటే పని జరగదు.”

ఇలా బాలీవుడ్ రీఎంట్రీపై తనదైన లాజిక్ వినిపించాడు చరణ్. సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ హీరోలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటానంటున్న రామ్ చరణ్.. మరో స్ట్రయిట్ హిందీ ప్రాజెక్టు చేసే విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్ గా ఉన్నాడు. పైగా ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నప్పుడు, మరోవైపు ఓటీటీ ట్రెండ్ కూడా ఊపందుకున్న నేపథ్యంలో.. స్ట్రయిట్ హిందీ సినిమా చేయాలని అనుకోవడంలో అర్థం లేదంటున్నాడు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్. ఆర్ఆర్ఆర్ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమా అదే. అది కూడా పాన్ ఇండియా మూవీనే.