రమేష్ వర్మకు జాక్ పాట్

రాక్షసుడు సినిమా తరువాత ఖిలాడీ సినిమా చేసిన దర్శకుడు రమేష్ వర్మ జాక్ పాట్ కొట్టారు. నిర్మాతలు కోనేరు హవీష్, కోనేరు సత్యనారాయణ ల నుంచి రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ గా పొందారు. …

రాక్షసుడు సినిమా తరువాత ఖిలాడీ సినిమా చేసిన దర్శకుడు రమేష్ వర్మ జాక్ పాట్ కొట్టారు. నిర్మాతలు కోనేరు హవీష్, కోనేరు సత్యనారాయణ ల నుంచి రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ గా పొందారు. 

ఖిలాడీ సినిమా బిజినెస్ సక్సెస్ ఫుల్ గా క్లోజ్ అయిన నేపథ్యంలో నిర్మాతలు ఫుల్ హ్యాపీతో దర్శకుడు రమేష్ వర్మకు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఖిలాడీ సినిమాకు దాదాపు 60 కోట్లు ఖర్చయింది. 

రవితేజ‌ సినిమాల్లో అత్యంత ఎక్కువ బడ్జెట్ తో తయారైన సినిమా ఇది. ఇంత బడ్జెట్ సినిమాను టేబుల్ ప్రాఫిట్ తో విడుదల చేయడం అంత సులువు కాదు. అయితే ఇప్పుడు పెరిగిన నాన్ థియేటర్ హక్కుల వల్ల కొంత వరకు ఇది సాధ్యమైంది. అదే విధంగా సినిమాను బయ్యర్లు అందరికీ చూపించి మరీ విక్రయించడం వల్ల మరింత సాధ్యమైంది.

ఈ నేపథ్యంలో రమేష్ వర్మకు ఖరీదైన కారు దొరికింది. టాలీవుడ్ లో సినిమాలు సక్సెస్ అయితే దర్ళకులకు కార్లు బహుమతిగా ఇవ్వడం అన్నది ఓ ఆనవాయితీగా మారుతోంది. గతంలో వెంకీ కుడుముల, మారుతి, బుచ్చిబాబు, ఇలా చాలా మంది కార్లు అందుకున్నారు.