‘రాక్షసుడు’ డైరెక్టర్.. చాలా ఎక్కువైందేమో!

అసలు కొన్నిసీన్లను మళ్లీ తీయనే లేదని ఆయనే చెబుతున్నాడు. తమిళం కోసం తీసిన సీన్లను యథాతథంగా అలాగే వాడుకున్నట్టుగా చెబుతున్నాడు. ఇక రివ్యూయర్లు కూడా తమిళ వెర్షన్ ను తెలుగులో కార్బన్ కాపీ చేశారని చెబుతున్నారు.…

అసలు కొన్నిసీన్లను మళ్లీ తీయనే లేదని ఆయనే చెబుతున్నాడు. తమిళం కోసం తీసిన సీన్లను యథాతథంగా అలాగే వాడుకున్నట్టుగా చెబుతున్నాడు. ఇక రివ్యూయర్లు కూడా తమిళ వెర్షన్ ను తెలుగులో కార్బన్ కాపీ చేశారని చెబుతున్నారు. తమిళంలో ఉన్న పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేయలేదని, ఎక్కడ మార్పు చేస్తే ఏమవుతుందో అనే భయంతో దించేశారని రివ్యూయర్లు  పేర్కొన్నారు. మరి ఆ స్థాయి కార్బన్  కాపీ గురించి దర్శకుడు రమేష్ వర్మ చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు.

తన సినిమా బాగుందని ఈ దర్శకుడు చెప్పుకుంటే అందులో తప్పేంలేదు. అయితే రీమేక్ చేయడంలోని గొప్పదనం గురించి ఈయన చెబుతున్నాడు. యథాతథంగా రీమేక్ చేయడానికి మించిన గొప్ప పని మరేంలేదని ఈయన చెప్పుకున్నాడు. అంతేకాదట.. వెనుకటికి సూపర్ గుడ్ మూవీస్ వారుచేసిన రీమేక్ సినిమాలంటే తనకు ప్రాణమన్నాడు. ఎంత తను రీమేక్ సినిమా చేస్తే మాత్రం ఇలా చెప్పుకోవాలా!

అంతటితోనూ ఆగలేదు ఈ 'రాక్షసుడు' దర్శకుడు. 'భారీ వసూళ్లు సాధించిన ఒక సూపర్ హిట్ సినిమాను ఒక సౌత్ టాప్ డైరెక్టర్ రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యింది..' అంటూ దెప్పి పొడిచాడు. శంకర్ ను ఉద్దేశించి ఈయన ఇలా మాట్లాడాడు. 'త్రీ ఇడియట్స్' రీమేక్ ఫెయిల్యూర్ పై ఇలా మాట్లాడినట్టుగా ఉన్నాడు.

ఇందులో ఆంతర్యం ఏమిటో ఈ దర్శకుడికే తెలియాలి. తను రీమేక్ చేసి, హిట్టు కొట్టినట్టుగా, శంకర్ హిట్టు కొట్టలేకపోయాడు కాబట్టి తనే గొప్ప అని ఇతడు చెప్పదలుచుకున్నాడేమో! ఈ రీమేక్ రాజా ఇలా మాట్లాడేస్తూ ఉండటం చాలా చోద్యంగానే ఉంది. తమరి సినిమాను తాము ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదు కానీ, ఇలా ఏదేదో మాట్లాడి తనేదో కళాఖండాన్ని సృజించిన మేధావిలో ఎందుకు మాట్లాడుతున్నట్టో!

తెలుగుదేశం.. ‘నో ప్లాన్’ వారి గేమ్ ప్లాన్