చిరకాలంగా వినిపిస్తున్న ప్రభాస్ బాలీవుడ్ సినిమా ప్రకటన రేపు ఉదయం ఏడు గంటలకు. ముందే అనుకున్నట్లు టీ సిరీస్ నిర్మాత. ఓంరౌత్ దర్శకుడు. అన్నీ తెలుసు కదా? రేపు ఏమిటి? ప్రకటన అన్నది జనాల క్యూరియాసిటీ. దాంతో రకరకాల గ్యాసిప్ లు.
ఓ బలమైన గ్యాసిప్ ఏమిటంటే ప్రభాస్ తో రామాయణం చేయబోతున్నారని. అందులో ప్రభాస్ రాముడిగా నటించబోతున్నాడని. ఈ సినిమాకు సుమారు అయిదు వందల కోట్ల బడ్జెట్ అని.
దేశంలో ఇప్పుడు అప్పుడు ఎప్పుడు రాముడి సెంటిమెంట్ బలంగా వుంది. అయోధ్య శంకుస్థాపన తరువాత ఇది మరింత బలంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో అల్లు అరవింద్ కూడా హిందీలో ఇలాంటి ప్రయత్నం చేయబోతున్నారని వార్తలు వినవచ్చాయి.
మొత్తం మీద ప్రభాస్ ప్రాజెక్టులో ఎవరు ఎవరు పాలు పంచుకుంటారు? విషయం ఏమిటి అన్నది రేపు ఉదయం తెలిసిపోతుంది. అన్నీ అనుకున్నట్లు నిజమైతే బాహుబలి ప్రభాస్ ను రాముడిగా చూడొచ్చు. ఎన్టీఆర్, శోభన్ బాబు తరువాత ఓ పాపులర్ తెలుగు హీరో రాముడిగా కనిపించడం ప్రభాస్ నే. ఇదిలావుంటే ప్రభాస్ చెేసేది రామాయణంలో ఓ భాగం మాత్రమే అని. రాముడి గెటప్ కూడా కొత్తగా వుంటుందని తెలుస్తోంది.