రానా- దుల్కర్- ఆసియన్ సునీల్

దుల్కర్ సల్మాన్ పూర్తిగా తెలుగు హీరో అయిపోయాడు. మహానటి, సీతారామం సినిమా తరువాత మన నిర్మాతలు అంతా దుల్కర్ వెంట పడుతున్నారు. ఇప్పటికే ఓ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరికి కమిట్ అయ్యారు. షేర్…

దుల్కర్ సల్మాన్ పూర్తిగా తెలుగు హీరో అయిపోయాడు. మహానటి, సీతారామం సినిమా తరువాత మన నిర్మాతలు అంతా దుల్కర్ వెంట పడుతున్నారు. ఇప్పటికే ఓ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరికి కమిట్ అయ్యారు. షేర్ మార్కెట్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది ఆ సినిమా. ఇది కాక మరో మూడు సినిమాలు చేసే అవకాశం వుంది.

రానా-దుల్కర్ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను ఆసియన్ సునీల్ నిర్మిస్తారు. ఈ సినిమా వీలయినంత త్వరగా పట్టాలు ఎక్కుతుంది. ఇది మల్టీ స్టారర్ మూవీ.

నాగార్జునకు బంధువైన ప్రశాంతి అనే నిర్మాత ఓ సినిమాను దుల్కర్ తో తెలుగులో చేయబోతున్నారు.

నిర్మాత చెరుకూరి సుధాకర్ ఓ కథతో దుల్కర్ ను ఒప్పించారు. దాంట్లో మరో హీరో ఎవరైనా ఓ స్పెషల్ రోల్ చేస్తారు.

మొత్తం మీద చూస్తుంటే ఇక దుల్కర్ మళయాల సినిమాల కన్నా తెలుగు సినిమాలే ఎక్కువ కమిట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మలయాళ సినిమాల బడ్జెట్ తక్కువ వుంటుంది. రెమ్యూనిరేషన్ కూడా దానికి అనుగుణంగానే వుంటుంది. అదే తెలుగు సినిమాలు అయితే బడ్జెట్ ఎక్కువే, రెమ్యూనిరేషన్లు ఎక్కువే.