Advertisement

Advertisement


Home > Movies - Movie News

అయ్యో శర్వా.. మళ్లీ వాయిదా

అయ్యో శర్వా.. మళ్లీ వాయిదా

శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రణరంగం సినిమా మినిమం గ్యాప్స్ లో వాయిదాలు పడుతూనే ఉంది. మొన్నటివరకు టైటిల్ దొరక్క ఈ సినిమాను పక్కనపెట్టారు. ఇప్పుడు టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత కూడా సినిమాను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

లెక్కప్రకారం ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కావాలి. కానీ ఇప్పుడా తేదీ నుంచి రణరంగం దాదాపు తప్పుకుంది. సినిమాకు సంబంధించి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాలేదు. ఈ 10 రోజుల్లో ఆ పని పూర్తవుతుందనే గ్యారెంటీ కూడా లేదు. దీనికితోడు శర్వానంద్ చెప్పిన కొన్ని మార్పులు చేయడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. అందుకే ఆగస్ట్ 2కు ఈ సినిమా వచ్చేది అనుమానంగానే ఉంది.

గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది రణరంగం సినిమా. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ లో శర్వానంద్ కనిపించబోతున్నాడు. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పాటల విడుదల కార్యక్రమం షురూచేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది రణరంగం. 

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?