స్టార్ హీరోహీరోయిన్ల పెళ్లిపై క్రిస్మస్ తో క్లారిటీ

బాలీవుడ్ హాట్ లవ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్లూ ప్రేమపక్షుల్లా విహరించిన ఈ ఇద్దరూ ఇకపై ఆలుమగలు కాబోతున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని క్రిస్మస్…

బాలీవుడ్ హాట్ లవ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్లూ ప్రేమపక్షుల్లా విహరించిన ఈ ఇద్దరూ ఇకపై ఆలుమగలు కాబోతున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని క్రిస్మస్ సందర్భంగా ఈ జంట నిర్ణయించుకుంది. ఈ మేరకు రణబీర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఈ పెళ్లి మేటర్ ను మరింత పక్కా చేసింది.

నిజానికి కరోనా లేకపోతే ఈపాటికి రణబీర్, అలియాభట్ పెళ్లి అయిపోయేదంట. కానీ కరోనా వల్ల ఆ ప్లాన్స్ అన్నీ ఆగిపోయాయని చెప్పుకొచ్చాడు ఈ హీరో. అయితే కొత్త ఏడాదిలో మాత్రం తన లిస్ట్ లో చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న పెళ్లి అనే అంశంపై టిక్ మార్క్ పెట్టేస్తానని ప్రకటించాడు. అది కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి ఉంటుందని కూడా స్పష్టంచేశాడు.

ఇక లాక్ డౌన్ టైమ్ లో అలియాతో గడిపిన క్షణాల గురించి కూడా మాట్లాడాడు రణబీర్. లాక్ డౌన్ లో అలియా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదంట. గిటార్ నుంచి స్క్రీన్ ప్లే రైటింగ్ వరకు చాలా విషయాలు నేర్చుకుందంట. ఇటు రణబీర్ మాత్రం అలాంటి క్రియేటివ్ పనుల్ని పక్కనపెట్టి.. కుటుంబంతో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. అంతేకాదు, రోజుకు 2-3 సినిమాలు కూడా చూశాడు.

లాక్ డౌన్ టైమ్ లో తమ రెండు కుటుంబాలు కాస్త ఇబ్బందులు పడ్డాయని.. ఆ టైమ్ లో ఒకరికొకరం సహాయం చేసుకున్నామని తెలిపిన రణబీర్.. 2021లో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తానంటూ ప్రకటించాడు. 

రాయ‌పాటి రాజ‌కీయం,వ్యాపారం