‘రంగబలి’ ఊరి..కుర్రాడి కథ

నాగశౌర్య లేటెస్ట్ మూవీ రంగబలి. దసరా లాంటి డిఫరెంట్ సినిమా అందించిన సుధాకర్ నిర్మాత.ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. శౌర్య, సత్య, ఫన్ ఫ్రెండ్స్ గా కనిపించిన టీజర్ లో యుక్తి…

నాగశౌర్య లేటెస్ట్ మూవీ రంగబలి. దసరా లాంటి డిఫరెంట్ సినిమా అందించిన సుధాకర్ నిర్మాత.ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. శౌర్య, సత్య, ఫన్ ఫ్రెండ్స్ గా కనిపించిన టీజర్ లో యుక్తి హీరోయిన్ గా కనిపించింది. పవన్ దర్శకుడు.

టీజర్ వరకు చూసుకుంటే ఫన్ అన్నదే కీలకంగా పెట్టుకుని సినిమా చేసినట్లు కనిపిస్తోంది. సగటు కుర్రాడు. బాధ్యత లేకుండా తిరగడం, తండ్రి తిట్లు, తల్లి బాధ, ఫ్రెండ్స్ తో సరదాలు, గొడవలు ఇలా అన్నీ టీజర్ లో కనిపించాయి. కొత్తగా చెబుతున్నదేమిటంటే ‘మన ఊరిలో మనర్నెవడురా ఆపేది’ అనే లోకల్ పాయింట్.

టీజర్ కలర్ ఫుల్ గా వుంది. శౌర్య గోదావరి యాస, రెండు మూడు ఫన్ సీన్లు బాగున్నాయి. హీరోయిన్ ట్రాక్ రొటీన్ నే. టీజర్ కనుక అసలు కథ ఏ దిశగా వెళ్తుంది అన్నది ఏమీ చూపించలేదు. జస్ట్ ఓ ఫన్ మూవీ అన్న కలర్, ఇంపాక్ట్ ఇవ్వడానికి ట్రయ్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ విధంగా చూసుకుంటే టీజర్ పాస్ అయినట్లే.

దివాకర్ మణి, ఎఎస్ ప్రకాష్, ప్రవీణ్ లాంటి మంచి టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. దానికి తగినట్లే టీజర్ అవుట్ పుట్ బాగుంది. మంచి హిట్ కోసం చూస్తున్న శౌర్య కోరిక ఈ సినిమాతో తీరుతుందేమో చూడాలి.