మరో వారం రోజుల్లో ఆదిపురుష్ విడుదల వుంది. ఈ టైమ్ లో ప్రభాస్ విదేశాలకు వెళ్లిపోయారు. విదేశాల్లో ఆదిపురుష్ విడుదల సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. అంటే ఇక ఈ వారం రోజులు ఇండియాలో ఆదిపురుష్ కు మరే విధమైన పబ్లిసిటీ లేనట్లే అనుకోవాలి. ముఖ్యంగా తెలుగులో ఇక వేరే విధమైన ప్రచార కార్యక్రమాలు వుండవన్నమాట.
నిజానికి అత్యంత భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన తరువాత ఇక పెద్దగా చేయడానికి ఏమీ వుండదు. మహా అయితే యూనిట్ తో రెండు మూడు కామన్ ఇంటర్వూలు తప్ప. ఇప్పటికే అలాంటివి ఏవైనా చేసి వుంటే అవి రిలీజ్ చేసుకోచవ్చు.
నిజానికి విడుదలకే టైమ్ చాలా టైట్ గా వుంది. లాస్ట్ మినిట్ లో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఎవరు అన్నది డిసైడ్ అయింది. అందువల్ల ఇప్పుడంతా థియేటర్ల ప్లానింగ్, లోకల్ పబ్లిసిటీ ప్లానింగ్ లో బిజీగా వున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ సినిమా భారీగా విడుదలవుతోంది. సినిమా విడుదలకు ముందు వెనుక సరైన సినిమాలు లేవు. అంతా ఖాళీగా వుంది. థియేటర్లు అన్నీ ఆదిపురుష్ నే కావాలనే పరిస్థితి వుంది. కానీ అలా అని విపరీతంగా థియేటర్లు పరిచేయడం లేదు.
చాలా సెలక్టివ్ గానే థియేటర్లను పెట్టాలని లెక్కలు వేస్తున్నారు. అలా అని మళ్లీ ఓపెనింగ్ నెంబర్లు తగ్గకూడదు. ఇలాంటి ప్లానింగ్ లు అన్నీ సాగుతున్నాయి ప్రస్తుతం.